అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. దీనిలో భాగంగా చిత్రంలోని రకుల్ ప్రీతి సింగ్ పాత్రను తాజాగా పరిచయం చేసింది. ఈ మేరకు చిన్న టీజర్‌ను వదిలారు. సినిమాలో రకుల్ పేరు అవంతిక. ఈ అమ్మాయిని చూసిన లక్ష్మి.. ‘అవంతిక పేరే ఎంత వినసొంపుగా ఉంది. అంతే పద్ధతి గల అమ్మాయి’ అని చాలా ఇష్టపడుతుంది.


కానీ, వాస్తవానికి అవంతిక అంత పద్ధతి గల అమ్మాయేంకాదు. అల్లరి పిల్ల. మొదట ‘యు’ సర్టిఫికెట్ ప్రయోగిస్తుంది. పనికాకపోతే ‘ఎ’ సర్టిఫికెట్ చూపిస్తుంది. అంతటి గడసరి. అలాంటి పిల్ల గురించి ‘ఆ అమ్మాయి చల్లటి గాలి లాంటిది సర్’ అని నాగార్జునతో వెన్నెల కిషోర్ అంటాడు. వెంటనే నాగార్జున ‘బొంగేంకాదు’ అని తీసిపారేస్తాడు. 


మొత్తం మీద ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. అవంతిక పాత్ర సినిమాకే హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. ‘ఈ వయసులో నువ్వు లవ్ ఫెయిల్యూర్‌లు తట్టుకోలేవు’ అని నాగార్జునతో రకుల్ అనగానే ఆయన హావభావాలు భలే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: