దివంగత దిగ్గజ నటి శ్రీమతి విజయ నిర్మల గారు హఠాత్తుగా మరణించిన ఘటనను తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు ఆమె మరణం తరువాత మరింత కృంగిపోవడంతో, అయన కుటుంబసభ్యులు సహా ఎందరో సినీ ప్రముఖులు కృష్ణ గారికి ఈ విషాద ఘటనను తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ విజయ నిర్మల గారికి నివాళులు అర్పించారు. ఇక రెండు రోజుల క్రితం విజయ నిర్మల గారి దశదిన కర్మకు పలువురు సినిమా ప్రముఖులు విచ్చేసి  విజయ నిర్మల గారి గొప్పతనాన్ని కొనియాడారు. 

ఆమె అంత హఠాత్తుగా ఎందుకు మరణించారో అర్ధంకాక ఆమె అభిమానులు ఎంతో కృంగిపోతున్నారు. అయితే దానికి ఒక కారణం ఉందట, మొన్నటి విజయనిర్మల గారి దశదిన కర్మ రోజున కృష్ణ గారు అసలు విషయాన్ని అక్కడికి విచేసినవారికి చెప్పడం జరిగిందట. నిజానికి మొదటి నుండి ఎంతో ఏకాగ్రతతో, అన్ని విషయాల్లోనూ ఎంతో చురుకుగా వ్యవహరించే విజయ నిర్మల గారికి, ఇటీవల అల్జీమర్స్ అనే వ్యాధి సోకిందని, దాని కారణంగా మెల్లగా ఆమె మెదడులోని ఒక నరం  దెబ్బతినడం, ఆపై ఆమెకు మెల్లగా జ్ఞాపకశక్తి లోపించడం వంటికి ప్రారంభమయ్యాయట. అయితే అప్పటినుండి విజయ నిర్మల గారు ఎప్పటికపుడు డాక్టర్ నుండి చికిత్స తీసుకుంటూ వేళకు మందులు వేసుకునేవారని, 

అయితే ఒక రోజు హఠాత్తుగా భోజనం తరువాత ఆమెకు ఛాతిలో కొంత నొప్పి రావడంతో సమీప ఆసుపత్రికి ఆమెను కుటుంబ సభ్యులు తరలించారని అన్నారు. ఆసుపత్రిలో డాక్టర్ పరీక్షించిన తరువాత కాసేపు బాగానే అందరితో మాట్లాడిన విజయ నిర్మల గారు, ఆపై ఒక గంట తరువాత హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో అకాల మరణం పొందినట్లు చెప్పారట. ఇక విజయ నిర్మల గారి మరణానికి  అసలు కారణమైన ఈ వార్త బయటకు రావడంతో, ఇది విన్న పలువురు ఆమె అభిమానులు, చివరి నిమిషంలో ఆమె పడ్డ బాధను తలచుకుని ఆవేదన చెందుతూ ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: