సౌత్ లో నయనతార కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటినా ఏమాత్రం తగ్గని తన బ్యూటీతో హీరోయిన్ చాన్సులు పట్టేస్తోంది. దీంతో లేడీ సూపర్ స్టార్ గా సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. నయన్ పెట్టే కండీషన్లకు నిర్మాతల కళ్లు బైర్లు కమ్మినా, ఖర్చు పెరిగినా ఆమెకున్న క్రేజ్ తెలుసుకాబట్టే చాన్సులిస్తున్నారు.

 

ఇటివల ఓ ట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో “ఔట్ డోర్ షూటింగ్ ఉన్నప్పుడు నేను చేసే సినిమా ప్రొడ్యూసర్లు నాకు ఫైవ్ స్టార్ హోటల్ వసతి కల్పించాల్సిందే” నంటూ కుండబద్దలు కొట్టింది. ఇదనే కాదు.. నయన్ డిమాండ్లపై అనేక వార్తలు వస్తూంటాయి. సెల్యూట్ సినిమాలో తన పారితోషికం కాకుండా ఓ ఇండోర్ సాంగ్ కోసం ప్రత్యేకంగా రెమ్యునరేషన్ తీసుకుందని అప్పట్లో వార్తలొచ్చాయి. సింహ సినిమాలో హీరో ఆమెను టచ్ చేయకూడదని షరతులు పెట్టిందట. బాబు బంగారం సమయంలో 5స్టార్ వసతి గురించి ఇబ్బందులకు గురి చేసిందని, వెంకీ కూడా ఈమె విషయంలో అసహనంగా ఫీలయ్యాడని సాక్షాత్తూ డైరెక్టర్ మారుతీనే అన్నాడు. అంతేకాదు, అమ్మడు ఏ సినిమా చేసినా ఆడియో ఫంక్షన్స్ కు గానీ, ప్రమోషన్స్ కోసం గానీ రాదు. అగ్రిమెంట్ అలా ఉండదు కదా అని ఎదురు చెప్తుందట. ఇంతగా తన ఆటిట్యూడ్ ని చూపించినా నిర్మాతలు మాత్రం ఆమెను కాదనలేరు. అంతటి క్రేజ్ ఉంది మరి.

 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సైరా, సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్, విజయ్ సినిమా, చిరంజీవితోనే 152 వ సినిమాలు చేస్తోంది నయన్. ఈ సినిమాల లిస్టు చూసైనా నయనతార క్రేజ్ ను మనం అంచనా వేయోచ్చు. అందుకే అంతలా డిమాండ్ చేస్తోంది. అన్నట్టు ఈ అమ్మడు తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో కూడా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: