ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఇక అంతేకాక పలు సినిమా ఇండస్ట్రీల్లో ఈ సినిమా బిజినెస్ కోసం బడా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఎగబడుతున్నారు.

డివివి దానయ్య దాదాపుగా రూ.400 కోట్లకు పైగా ఖర్చుతో అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం ప్రస్తుతం వెతుకులాట మొదలెట్టింది ఆర్ఆర్ఆర్ యూనిట్. ఇక ఈ సినిమా కోసం త్వరలో ఎన్టీఆర్ పై ఒక భారీ యాక్షన్ సీన్ తీయనుందట సినిమా యూనిట్. ఇది ఆయన క్యారెక్టర్ యొక్క ఇంట్రడక్షన్ సీన్ అని, సినిమాలో రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్ లో ఇది కూడా ఒకటని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. దాదాపుగా 200 కు పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్న ఈ భారీ యక్షన్ సీన్ కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడుతున్నారని, 

ఇక ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్న ఒక ఫోటో బయటకు రావడంతో ఆయన అంత భారీ స్థాయిలో కసరత్తులో చేస్తోంది ఆర్ఆర్ఆర్ లోని ఆ భారీ యాక్షన్ సీన్ కోసమేనని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ వార్తలో ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కనుక, ఒకవేళ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజం అయితే, ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దు ఉండదు అనే చెప్పాలి....!!    


మరింత సమాచారం తెలుసుకోండి: