అక్కినేని అభిమానులకే కాదు సినిమా ప్రేమికులకు కూడా ఆల్ టైం ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన మన్మథుడు కి సీక్వెల్ మన్మథుడు-2 రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు సిద్దమవుతోంది. గత నెల రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు హీరోయిన్ అవంతిక పాత్రను చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కొత్త వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. అందులో అవంతిక పాత్రను చాలా క్లియర్‌గా చూపించేశారు. అందరు అనుకున్నట్టుగా రకుల్ ఈ సినిమాలో హాట్‌గా కనిపిస్తుందనుకుంటే యమా నాటుగా రెచ్చగొడుతోంది.

లేట్ ఏజ్ అయినా పెళ్లి కాకుండా మిగిలిపోయిన నాగ్ ను టార్గెట్ చేసుకుని ముందు అతని తల్లి(లక్ష్మి)ని టార్గెట్ చేస్తుంది అవంతిక. పద్ధతికి మారుపేరుగా సంప్రదాయం ఉట్టిపడుతున్న లక్షణాలతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది . కాని తీరా నాగ్ దగ్గర మాత్రం తనలో అసలు కోణం బయటికి తీస్తుంది. వాళ్ళందరికీ యు సర్టిఫికేట్ సినిమా చూపించి నాగ్ కు అడల్ట్ మూవీ ఓపెన్ చేస్తుంది. అసలు అవంతిక ఇలా రెండు షేడ్స్ లో ఎందుకు కనిపించింది మన్మథుడికి తనకు కనెక్షన్ ఏంటి అనేది తెరమీద చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

ప్రత్యేకంగా రకుల్ కోసమే ఈ టీజర్ కట్ చేశారు కాబట్టి కాన్సెప్ట్ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. అంతేకాదు రకుల్ ఎప్పటిలాగే గ్లామర్ గా ఉంది. ఈ వయసులో లవ్ బ్రేక్ అప్ అయితే తట్టుకోలేవు అంటూ నాగార్జున తన మీద తానే మరోసారి జోక్ వేసుకోవడం బాగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి మన్మథుడు 2లో అవంతికది రెగ్యులర్ హీరొయిన్ కాకుండా మంచి వెయిట్ ఉన్న పాత్రని అర్థమైపోయింది. ఆగస్ట్ 9 న విడుదల కానున్న మన్మథుడు 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఏ మన్మథుడు.. ఏ మన్మథుడుకి పోటీనో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: