సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తన తమ్ముడు నటించిన దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి అదిరిపోయే రీతిలో స్పీచ్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ భావోద్వేగానికి గురై తన తమ్ముడి కోసం చెప్పిన మాటలు తన తమ్ముడు తన జీవితంలో చేసిన విషయాల గురించి ప్రేక్షకులకు పంచుకున్న క్రమంలో కన్నీటికి లోనైన విజయ్ దేవరకొండ ...సినిమా తీసిన విధానాన్ని తెచ్చుకుంటూ డైరెక్టర్ ని ఆకాశానికెత్తేశాడు.


అంతేకాకుండా ఈ సినిమా ప్రివ్యూ చూసిన విజయ్ దేవరకొండ సినిమా అదిరిపోయిందని డైరెక్టర్ కెవిఆర్.మెహేంద్ర మేకింగ్ చాలా బావుందని ప్రతి సీన్ లో తన మార్క్ క్రియేట్ చేశాడని చెప్పాడు. అదే విధంగా తన డైరెక్షన్ ఎంతగానో నచ్చింది అంటూ. ఓ కథ నాకోసం రాస్తున్నవాని విన్నా తొందరగా స్క్రిప్ట్ ఫినిష్ చెయ్. చేయడానికి నేను రెడీ అంటూ విజయ్ అతనికి అడక్కుండానే ఆఫర్ ఇచ్చేశాడు.


ప్రస్తుతం విజయ్ దేవరకొండతో వర్క్ చేయడానికి చాలా మంది స్టార్ దర్శకులు క్యూలో ఉన్నారు. కథ నచ్చకుంటే విజయ్ వెంటనే రిజెక్ట్ చేస్తున్నాడు. అలాంటిది దొరసాని ఇంకా రిలీజ్ కూడా కాలేదు..అప్పుడే ఆ కొత్త దర్శకుడికి అందరి ముందు ఆఫర్ ఇచ్చాడు అంటే దొరసాని ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: