గత ఏడాది బాగా క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటి, మల్టీ స్టారర్ దేవదాస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే . నాగార్జున నానిలు మొదటిసారి కాంబోగా వచ్చిన ఈ సినిమ యావరేజ్ అనిపించుకుందే తప్ప సూపర్ హిట్ కాలేకపోయింది . ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అప్పటి నుంచి ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ దేవదాస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుంటే మాత్రం ఈపాటికి నిర్మాతల క్యూ కట్టి ఉండేవాళ్ళు.

అలా అని అసలు ఆఫర్స్ లేకుండా లేదని కాదు కాని ముందున్న దూకుడు ఈ దర్శకుడిలో కనిపిస్తున్నట్టు లేదు. ఏదో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ఆ మధ్య కొంత ప్రచారం జరిగింది. తర్వాత అలాంటిది ఏమి లేదని తేలిపోయింది. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది. ఒక హీరోతో కాంబినేషన్ సెట్ చేసుకుని నిర్మాతతో ఓకే చేయించుకున్నాడని టాక్ వచ్చింది కాని అదీ డైలమా స్టేజిలోనే ఉందట. 

శ్రీరామ్ ఆదిత్య మొదటి సినిమా భలే మంచి రోజు మంచి సక్సెస్ అయి మంచి పేరు తెచ్చింది. తర్వాత నలుగురు యూత్ హీరోలతో చేసిన శమంతకమణి పర్వాలేదు అనిపించుకుంది. కాని మొదటిసారి ఇద్దరు స్టార్లను ఒకేసారి డీల్ చేయడంలో శ్రీరామ్ తడబడటంతో గట్టి దెబ్బ పడింది. దేవదాస్ వచ్చి దాదాపు రెండేళ్ళవస్తోంది. మరి ఇంత టైం తీసుకున్నా గాని ఏదైనా మంచి ప్రాజెక్ట్ తో వస్తాడో లేదా ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: