ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన 'సాహో' సినిమా ఫస్ట్ సాంగ్ విడుదలయ్యింది. సైకో సైయాన్ టైటిల్ పేరిట విడుదలైన ఈ పాట విన్న ప్రభాస్ అభిమానులు మ్యూజిక్ అసలు అర్థం కావడం లేదని ప్రేమ సంగీత డైరెక్టర్ తనిష్క్ భాగ్చి బాలీవుడ్ టైప్ లోనే మ్యూజిక్ అందించారని తెలుగు నెటివిటీకి మ్యూజిక్ అర్థం కావడం లేదని విడుదలైన సాహో ఫస్ట్ సాంగ్ పై కామెంట్లు చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.


అంతేకాకుండా సినిమా టీజర్ మాదిరిగానే ఫస్ట్ సాంగ్ కూడా నాలుగు భాషల్లో విడుదల చేశారు. మరోపక్క  చాలా మందికి అయితే తెలుగు మలయాళం కంటే హిందీ మరియు తమిళ్ వెర్షన్ లలో విడుదల చేసిన పాటలే బాగా నచ్చాయట. ప్రస్తుతానికి అయితే ఈ పాటకు సంబంధించి సోషల్ మీడియాలో ఇలా టాక్ నడుస్తుంది.


ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ చేసిన ఫైట్లు హాలీవుడ్ సినిమాని తలపిస్తాయని అంటున్నారు సినిమా యూనిట్ కి చెందినవారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: