ఈ నెల 19న విడుదల కానున్న లయన్ కింగ్ సినిమా మీద అంచనాలు మాములుగా లేవు. పేరుకే హాలీవుడ్ మూవీ. కానీ సౌత్ లోనూ మన సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ట్రైలర్ సూపర్ హిట్ అయ్యింది. ఒక్కో భాషకు స్టార్లను సెట్ చేసుకుని మరీ డబ్బింగ్ చెప్పించడంతో లయన్ కింగ్ మీద ఆయా అభిమానుల చూపు కూడా పడటంతో అంచనాలు ఒక రేంజ్‌లో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాని డబ్బింగ్ చెప్పిన సింబా తాలూకు వీడియో ప్రోమోను విడుదల చేశారు డిస్నీ పిక్చర్స్.

నాని డబ్బింగ్ స్టూడియోలో వాయిస్ ఇవ్వడం చూపించి ఆ తర్వాత లయన్ కింగ్ సన్నివేశాల్లో నేను సింబా ముఫాసా కొడుకుని అంటూ  న్యాచురల్ స్టార్ గాత్రం ఉన్న క్లిప్ ని చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వీడియోని నాని స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశాడు. నానితో పాటు జగపతి బాబు-రవి శంకర్-బ్రహ్మానందం-ఆలీ డబ్బింగ్ చెప్పిన లయన్ కింగ్ పాత రికార్డులు బ్రేక్ చేస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు నానీ అభిమానులు.

ఈ మధ్య కాలంలో మన స్టార్లు క్రేజీ ఇంగ్లీష్ మూవీస్ కి డబ్బింగ్ చెప్పడం పెరుగుతోంది. ఈ మధ్యే అల్లాయుద్దీన్ కు వెంకటేష్ వరుణ్ తేజ్ లు మాటలు చెప్పడం పెద్ద ప్లస్ అయ్యింది. జగపతిబాబు గతంలో ఓ సినిమాకు చెప్పాడు. కానీ నానికి మాత్రం ఇది కొత్త అనుభవం. అయినా ఇరగదీశాడని తెలుస్తోంది. ఇక ఇది వర్క్ అవుట్ అయ్యిందా ఇదే వరసలో మన వాళ్ళు ఇకపై డబ్బింగ్ చెప్పడాన్ని అలవాటుగా చేసుకుంటారేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: