బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కి ఎంతయితే పేరొచ్చిందో, ఎంతగా అయితే పాపులర్‌ అయ్యాడో ఇంచుమించు అంతే పాపులర్‌ అయింది అనుష్క. హీరోతో సమానమైన రేంజ్‌ హీరోయిన్‌కి రాకపోయినా కానీ బాహుబలి వల్ల అనుష్క కూడా జాతీయ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకుందని చెప్పడంలో సందేహం లేదు. 


బాహుబలితో వచ్చిన క్రేజ్‌ని ప్రభాస్‌ సద్వినియోగం చేసుకునేందుకు సాహో చేస్తున్నాడు. బాహుబలితో వచ్చినది కేవలం గాలి బుడగ మాదిరి పాపులారిటీ కాదని సాహోకి వస్తోన్న స్పందనే చెబుతోంది. ప్రభాస్‌లా భారీ సినిమా చేయలేకపోయినా అనుష్క కూడా తన మలి చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషలలో చేస్తోంది. 


నిశ్శబ్ధం పేరిట ఆమె చేస్తోన్న ఈ థ్రిల్లర్‌ అన్ని భాషల వారికి కనక్ట్‌ అయ్యేలా వుంటుందట. బాహుబలి రాకముందే తెలుగు, తమిళంలో అనుష్కకి గ్యారెంటీ మార్కెట్‌ వుంది. బాహుబలి వల్ల హిందీలో కూడా పాపులర్‌ అయింది కనుక ఈ చిత్రం అక్కడా కన్నేసింది. 


ఈ చిత్రంలో నటించడం కోసం కష్టపడి సహజ పద్ధతులలో బరువు తగ్గిన అనుష్క అహర్నిశలు శ్రమిస్తూ షూటింగ్‌ చేస్తోంది. ఇటీవలే మొదలయిన ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో మంచి ముహూర్తం చూసుకుని ఈ చిత్రాన్ని అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: