తానా మహాసభలు అత్యంత ఘనంగా జరిగిన తరువాత వెనువెంటనే ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఒక టాప్ కమెడియన్ చుట్టూ కొన్ని గాసిప్పులు ఇప్పుడు హడావిడి చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హల్ చల్ చేస్తున్న ఈ వార్తల ప్రకారం ఈ టాప్ కమెడియన్ పై ఒక డిన్నర్ పార్టీలో దాడి జరిగింది అని అంటున్నారు. 

ఆశ్చర్యాన్ని కలిగించే ఈ వార్తల వివరాలలోకి వెళితే తానా మహా సభలలో ఆ కమెడియన్  పాల్గొన్న తరువాత మరొక చిన్న తెలుగు సంస్థ తమ సభ్యులతో ఏర్పాటు చేసిన మరొక సమావేశానికి అతడిని అతిధిగా పిలిచినట్లు టాక్. ఆ సమావేశం తరువాత ఆ స్టార్ కమెడియన్ పాల్గొన్న ఒక డిన్నర్ పార్టీలో విపరీతంగా తాగిన మత్తులో ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

ఆ స్టార్ కమెడియన్ ప్రవర్తనతో విసుకు చెందిన ఆ మహిళ కుటుంబ సభ్యులే ఆ కమెడియన్ పై దాడి చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయం అమెరికాలోని పోలీసుల వరకు తీసుకు వెళ్లాలని భావించినా ఆ కమెడియన్ ను అతిధిగా పిలిచిన సంస్థ నిర్వాహకులకు చెడ్డ పేరు వస్తుందని ఈ వ్యవహారాన్ని సద్దుబాటు చేసినట్లు టాక్.

తానా మహాసభల కోసం వెళ్ళిన ఆ కమెడియన్ ఇంకా ఇండియాకు తిరిగి రాకుండానే ఇప్పుడు ఈవార్త వైరల్ గా మారి ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తోంది. ఆ కమెడియన్ ఎవరు అన్నదాని పై మాత్రం స్పష్టత ఇవ్వడానికి ఇండస్ట్రీ వర్గాలు నిరాకరిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎవరో కావాలని ఆ కమెడియన్ అంటే ఇష్టపడని వారు క్రియేట్ చేసిన గాసిప్ అంటూ మరికొందరు ఈ వార్తలను లైట్ గా తీసుకుంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: