రజీనీకాంత్ అంటే తమిళ్ తో పాటు ఇండియా లెవల్, చైనా, జపాన్ దేశాల్లో కూడా మార్కెట్ అయ్యేంత    రేంజ్ ఉన్న హీరో. ఆయన సినిమాలకు అంతటి మార్కెట్ ఉంది. ముత్తు సినిమాతో ఆయనకు జపాన్ లో అభిమానులు ఏర్పడ్డారు. జపాన్ లో ఒక భారతీయ హీరోకు అభిమానులు ఏర్పడటం రజినీకాంత్ తోనే మొదలైంది.


చైనా, జపాన్ లో కూడా మంచి బిజినెస్ జరిగే రజినీ సినిమాలను ఇప్పుడు అక్కడ కొనాలంటేనే భయపడుతున్నారు. రోబో 2.0 సినిమాను చైనాలో రిలీజ్ చేయాలని హెచ్ వై మీడియా సంస్థ ఏర్పాట్లు చేసింది. జూలై 12న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించి టోటల్ గా రోబో 2.0 ను రిలీజ్ చేయకుండా డ్రాప్ అయిపోయినట్టు సమాచారం. అక్కడ ఈ సినిమా లాభాలు రావాలంటే కనీసం 25 మిలియన్ డాలర్లు ( దాదాపు 170 కోట్లు ) రాబట్టాలి. అది అసాధ్యమని ఆ సంస్థ రిలీజ్ చేయలేక చేతులెత్తేసింది. ఈ సినిమాను అక్కడ కొనకపోవటానికి కారణం సినిమాలో ఉన్న హైలెవల్ గ్రాఫిక్ కంటెంటేనని తేల్చారు. ఇలాంటి గ్రాఫిక్ మూవీస్ ను చైనీయులు ఎక్కువే చూసి ఉండటం.. దాంతో పోలిస్తే ఈ సినిమా గ్రాఫిక్స్ బోరింగ్ అనిపించి సదరు సంస్థ రిలీజ్ కు వెనకడుగు వేసింది. చైనా మార్కెట్ లో అయినా సినిమాను నిలబెడాదం అనుకున్న రజినీ-శంకర్ టీమ్ కు ఇది శరాఘాతంలాంటి వార్తే.

 

2010లో రోబో తరువాత రజినీకి సరైన హిట్ లేదు. మార్కెట్ పరంగా సినిమాలు వర్కౌట్ అవుతున్నా.. ఆ స్థాయి కలెక్షన్లు రావట్లేదు. లింగా, కబాలి, కాలా, పెటా, రోబో2 సినిమాల్లో కంటెంట్ లేక తమిళ్ తో సహా ఎక్కడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. శంకర్ కాంబోలో వచ్చిన రోబో 2.0 మీద అంచనాలతో భారీగా బిజినెస్ జరిగినా ఎక్కడా హిట్ టాక్ పడలేదు. ప్రస్తుతం రజినీ మురుగదాస్ తో దర్బార్ మూవీ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: