ఇండియన్ క్రికెటర్ తో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ లో కొద్దీ కాలం నుంచి వస్తున్న వార్తలు. ప్రస్తుతం ప్రపంచ కప్ క్రికెట్‌ టోర్నిలో రాణిస్తున్న బూమ్రాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వచ్చిన వార్తలపై అనుపమ పరమేశ్వరన్ స్పందించారు. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు. జస్ప్రిత్ బూమ్రాతో అఫైర్ వార్తలు నా దృష్టికి వచ్చాయి. అయితే క్రికెటర్‌గా ఆయన పేరు పరిచయం ఉంది. కానీ వ్యక్తిగతం నాకు ఆయన ఎవరో తెలియదు.


క్రికెటర్‌గానే పరిచయం ఉంది తప్ప అంతకంటే ఎక్కువగా ఏమీ తెలియదు. అలాంటి నాకు ఆయనకు రిలేషన్ అంటగడుతారా అని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్దాలే అని ఆమె స్పస్టం చేశారు. తనతో ఇతరులకు రిలేషన్ అంటగట్టే వార్తలు రాసే ముందు వాస్తవమేమిటో తెలుసుకోవాలి. ఆ వార్తలో నిజా నిజాలు తెలుసుకొని రాస్తే మాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.


రూమర్లు క్రియేట్ చేస్తే మా మనోభావాలు దెబ్బ తింటాయి. సెలబ్రిటీలమైనంత మాత్రాన మాకు ఓ జీవితం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి అని అనుపమ అన్నారు. క్రికెటర్ జస్టిన్ బూమ్రాకు సినీ తారలకు లింక్ ఉన్నట్టు గతంలో కూడా భారీగా వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం అందాల తార రాశీఖాన్నాతో బూమ్రా డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలు సెన్సేషన్‌గా మారాయి. అయితే అవన్నీ గాలి వార్తలే అని స్పష్టమైంది. తాజాగా బూమ్రాతో అనుపమ డేటింగ్ వార్త సెన్సేషన్‌గా మారింది. అయితే ఆమె స్పందించడంతో అసలు విషయం బయటపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: