ఎవరో తప్పు చేస్తే మరెవరో బలైనట్లు..ఇప్పడు తెలంగాణలో ఓ జిమ్ నిర్వాహకుల చేసిన పొరపాటుకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇబ్బందుల్లో పడ్డారు. ఈ మద్య కల్ట్.ఫిట్ సంస్థ సంస్థలో తాను చేరి డబ్బులు కట్టానని..కానీ తనకు సరైన వసతి కల్పించకుండా ఇబ్బంది పెట్టారని..తనలా చాలా మంది బలైపోతున్నారని కూకట్‌పల్లి కి చెందిన శ్రీకాంత్‌ అనే యువకుడు కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లతో పాటు హృతిక్ రోషన్‌పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


దీంతో కూకట్‌పల్లి పోలీసులు ఆ సంస్థ డైరెక్టర్లు ముకేశ్‌ బన్సాల్, అంకిత్ నగోరి, నిర్వహణాధికారి మణి సుబ్బయ్యతో పాటు హృతిక్ రోషన్‌పై కేసు నమోదు చేశారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా  తనపై హైదరాబాద్‌లో నమోదైన కేసు కొట్టివేయాలంటూ బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌ తెలంగాణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఆయనతో పాటు కల్ట్.ఫిట్ సంస్థ నిర్వాహకులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు.


ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పోలీసులు, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీచేసింది. కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాగా, శ్రీకాంత్ చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని, కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: