నీకోసం సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు డైరెక్టర్ శ్రీనువైట్ల. కెరీర్ ప్రారంభంలోనే ఆనందం, సొంతం, వెంకీ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. చిరంజీవితో తీసిన అందరివాడు ఫ్లాప్ అయినప్పటికీ ఆ తరువాత వరుసగా ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. శ్రీనువైట్ల హిట్లు ఇవ్వటంలో రచయితలు గోపీ మోహన్, కోన వెంకట్ పాత్ర కూడా ఉంది. 
 
వరుస ఫ్లాపుల్లో ఉన్న మహేశ్ బాబుకు దూకుడులాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శ్రీనువైట్ల. ఎన్టీయార్తో శ్రీనువైట్ల తీసిన బాద్షా సినిమా కూడా హిట్టే. కానీ ఆ తరువాత మాత్రం శ్రీను వైట్ల ఏ సినిమా తీసినా డిజాస్టర్ అవుతుంది.మహేశ్ బాబుతో ఆగడు, రామ్ చరణ్ తో బ్రూస్ లీ, వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాలు శ్రీనువైట్ల ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్న పేరునంతా పోగొట్టాయి. శ్రీనువైట్లకు చాన్సులు ఇచ్చే హీరోలే కరువయ్యారు. 
 
కానీ వెంకీ, దుబాయ్ శీను లాంటి హిట్లు ఇచ్చినందుకు రవితేజ శ్రీనువైట్లకు మరలా అవకాశం ఇచ్చాడు. కానీ రవితేజ అవకాశం ఇచ్చినా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు శ్రీనువైట్ల. ఇలా వరుసగా నాలుగు డిజాస్టర్లు ఇవ్వటంతో శ్రీను వైట్లతో సినిమాలు తీయటానికి హీరోలు, నిర్మాతలు ఎవరూ ఆసక్తి చూపట్లేదు. మరి శ్రీను వైట్ల ఇంకో అవకాశం రావాలంటే ఇంకా ఎంత కాలం వేచి చూడాలో. 



మరింత సమాచారం తెలుసుకోండి: