ప్రభాస్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సాహో. ఈ సినిమాకి సంబంధించిన ఇటీవల విడుదలైన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ లో కూడా వైరల్ అవుతోంది. టీజర్ లో ఉన్న యాక్షన్ సన్నివేశాలు బట్టి చూస్తే సినిమాలో యాక్షన్ పార్ట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థమవుతోంది. అయితే ఈ మధ్య ఇదే తరహాలో యాక్షన్ తరహాలో వచ్చిన  రోబో 2.0, రేస్ 3 వంటి సినిమాల్లో స్టోరీ లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.


భారీ అంచనాలతో విడుదలైన రెండు సినిమాలలో డ్రామా లేకపోవడం ఎక్కువ స్టంట్లతో స్క్రీన్ అంతా నింపడంతో తలనొప్పి అని ప్రేక్షకులు సినిమా చూసి కామెంట్లు చేశారు. అయితే సాహోలో మాత్రం యాక్షన్ సన్నివేశాలతో పాటు స్టోరీ కూడా ఉంటేనే సినిమాకి తిరుగుండదని ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అంటూ సోషల్ మీడియాలో సాహో సినిమా కోసం ఎదురుచూస్తున్నా సినిమా ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.


ఇకపోతే ఆ రెండో పాయింట్ ఏంటంటే.. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ అంతా కూడా టాప్ క్వాలిటీలో ఉండాలి. మనోళ్లు గ్రాఫిక్స్ ఎంత కష్టపడి ఖర్చుపెట్టి చేయించానా కూడా ఎందుకో హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ మాత్రం కనిపించదు. అలా ఉండకపోయినా పర్లేదు కాని, మరీ లోకల్ క్వాలిటీ తరహాలో ఉండకూడదు. డ్రామా అండ్ గ్రాఫిక్స్ సరిగ్గా సెట్టయితే మాత్రం ‘సాహో’ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: