తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వరన్న కామెంట్ కు కరెక్ట్ సమాధనం చెబుతూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది ఈషా రెబ్బ. అంతకుముందు ఆ తర్వాత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు వరుస సినిమాల్లో దూసుకెళ్తుంది. యువ హీరోలతో జతకడుతున్న ఈ అమ్మడు స్టార్ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.


అయితే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో గ్లామర్ షోకి దూరంగా ఉన్న ఈషా రెబ్బ ఇక నుండి అందుకు రెడీ అవుతుంది. ఈషా రెబ్బ లీడ్ రోల్ లో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాగల 24 గంటలలో. ఈ సినిమాలో ఈషా రెబ్బ రెచ్చిపోవడం ఖాయమట. సినిమా ఓపెనింగ్ సీన్ లోనే ఈషా రెబ్బ బికిని ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.


మడి కట్టుకు కూర్చుంటే ఇక్కడ జరిగే పని కాదని తెలుసుకుంది కాబోలు అందుకే ఈషా రెచ్చిపోయేందుకు ఫిక్స్ అయ్యింది. అరవింద సమేత సినిమాలో తారక్ తో నటించే ఛాన్స్ వచ్చినా ఆ సినిమాలో ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చే పాత్ర దొరకలేదు. అందుకే మళ్లీ అమ్మడు యువ హీరోల సినిమాల్లో నటిస్తుంది.


ఇక ఇప్పుడు స్కిన్ షోకి రెడీ అయ్యిందంటే ఈషాకి వరుస ఛాన్సులు వచ్చినట్టే. తప్పకుండా రాగల 24 గంటలలో సినిమా ఈషా రెబ్బకి మంచి ఫలితాన్నే ఇస్తుందని చెప్పొచ్చు. శ్రీనివాస్ రెడ్డి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: