మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గ్యాంగ్ లీడర్ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1991 మే9 న విడుదలైన ఆ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ ఏడాదికి అతి పెద్ద ఇండస్ట్రీ హిట్. చిరంజీవి మెగాస్టార్ ఇమేజ్ ను ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. 56 కేంద్రాల్లో శతదినోత్సవం,  ఒకే రోజు 4 సెంటర్ల (హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, ఏలూరు)లో శతదినోత్సవం జరుపుకుని ఒక ప్రత్యేక రికార్డు సృష్టించింది.


అదే సినిమాను ఆజ్ కా గూండారాజ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి మళ్లీ నటించిన సినిమా 1992 జూలై 10న విడుదలైంది. అక్కడ కూడా సూపర్ హిట్. చిరంజీవి డాన్సులకు హిందీ అభిమానులు ఫిదా అయిపోయారు. సినిమాలో ఫస్ట్ సాంగ్ “No one can.. dance with me..” అనే పాట అప్పట్లో హిందీ చిత్రసీమలో ఓ సంచలనం. ఆ సాంగ్ లో ఆయన డ్యాన్స్ మూమెంట్స్ గురించి బాలీవుడ్ లో పెద్ద చర్చే జరిగింది. దాదాపు ప్రతి బంబే క్లబ్ హౌస్ లో ఏడాది పాటు రెగ్యులర్ సాంగ్ గా ఉండిపోయింది. ప్రతి పార్టీలో ఆ పాట మోగిపోయింది. ప్రభుదేవా కంపోజ్ చేసిన చాలా క్రిటికల్ డ్యాన్స్ మూమెంట్స్ ఎంతో ఈజ్ తో చేసిన చిరంజీవి బాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఏపీలో కూడా హిందీ వెర్షన్ రిలీజ్ అయ్యి 50 రోజులు విజయవంతంగా రన్ అయింది.


 ఆ సమయంలో చిరంజీవి ఒక్కో సినిమాకు కోటీ 25 లక్షలు పారితోషికం తీసుకుంటూ అమితాబ్, రజినీకాంత్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోగా ఇండియాలో ఆయన పేరు మోగిపోయింది. హిందీలో ఈ సినిమా సాధించిన హిట్ తో ది వీక్ పత్రిక “ Bigger than Bachan” అంటూ కవర్ పేజీలో ముద్రించింది. ఆ స్థాయిలో చిరంజీవీ క్రేజ్ ఉండేది. నేటితో ఆ సినిమా రిలీజ్ అయ్యి 27 ఏళ్లు పూర్తయ్యాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: