టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ హీరోయిన్లు ప్రస్తుతం విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు, దానికి కారణం అక్కడి సినిమాలు ఎక్కువగా విదేశాల్లోనే రూపొందుతూ ఉండడం. ఇక తన కొత్త బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో కలిసి విదేశాల్లో చక్కర్లు కొడుతున్న సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా ఖాన్, ఎన్నడూ లేనంత ఆనందంగా మరియు ఉల్లాసంగా ప్రస్తుతం తన లైఫ్ నడుస్తోందని అంటోంది. 

ఇన్నేళ్ల తన వివాహ జీవితంలో పెద్దగా సమస్యలు ఏమి లేనప్పటికీ, అర్బాజ్ కు నాకు మధ్య చిన్నపాటి బేధాభిప్రాయాలు వచ్చాయి, వాటివలన మేము విడిపోవలసి వచ్చింది. అయితే ఎంతైనా ఒక కుటుంబం ఏర్పడి భార్యగా, బిడ్డలకు తల్లిగా ఉన్న తనకు, ఆ విడాకుల సంఘటన కొంత మానసిక వేదనను కలిగించిందని ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక ప్రస్తుతం తాను అర్జున్ తో కలసి హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నానని, అయితే మీరిద్దరూ పెళ్లిచేసుకుంటారా అనే ప్రశ్నకు మాత్రం ఆమె బదులివ్వలేదు. 

ఇక ఆ విషయం అటుంచితే, ఇదివరకటితో పోలిస్తే మలైకా ఎంతో యంగ్ గా కనపడుతున్నారని, అలానే ఆమె ముఖం అద్భుతంగా వెలిగిపోతోందని ఆమెను చూస్తున్న పలువురు చెపుతున్నారట. అయితే దానికి కారణం, తాను నిత్యం యోగ, మెడిటేషన్ వంటివి చేయడం, ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తినకపోవడం, మరీ ముఖ్యంగా తనకు ప్రస్తుతం మానసికంగా ఎంతో ఆనందంగా ఉన్నందువల్లనే బయటకు తన మొహం ఆ విధంగా వెలిగిపోతునంట్లు కనపడుతోందని ఆమె చెపుతోంది. అయితే ఎంత తాను బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసినా, తన పిల్లల సంరక్షణ బాధ్యత మాత్రం మరువను అంటోంది మలైకా......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: