ఇటీవల తన కెరీర్ లోని 25వ సినిమా మహర్షి ద్వారా సూపర్ డూపర్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దాని తరువాత నటిస్తున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటివరకు తన సినిమా కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా ఎదురర్కోని యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. సూపర్ స్టార్ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన్న జోడి కడుతున్న ఈ సినిమాకు యువ సంగీత తరంగం దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కాశ్మీర్ లో ప్రారంభమయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్నట్లు సినిమా ప్రారంభోత్సవ సమయంలో దర్శకుడు అనిల్ చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు పేరు మేజర్ అజయ్ కృష్ణ అని తెలుస్తోంది. ఇక కాసేపటి క్రితం అజయ్ కృష్ణ పేరుతో ఉన్న నేమ్ ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వార్త తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

మేజర్ గా పనిచేస్తున్న అజయ్ కృష్ణ, కొన్ని పరిస్థితుల ప్రభావం వలన తన సొంతూరైన కర్నూలు రావడం, అక్కడ విలన్ల భరతం పట్టడం వంటి అంశాలతో ఎంతో వినోదాత్మకంగా కథ నడుస్తుందని సమాచారం. ఇక మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకునే విధంగా మహేష్ బాబు క్యారెక్టర్ ని దర్శకుడు అనిల్ ఈ సినిమాలో డిజైన్ చేయడం జరిగిందట. మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: