Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 7:52 pm IST

Menu &Sections

Search

మిస్ గ్రానీతో ఆ కోరిక తీర్చుకోవాలి అనుకుంటున్నా సమంత

మిస్ గ్రానీతో ఆ కోరిక తీర్చుకోవాలి అనుకుంటున్నా సమంత
మిస్ గ్రానీతో ఆ కోరిక తీర్చుకోవాలి అనుకుంటున్నా సమంత
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమంత. ఏమాయ చేసావే సినిమాతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అంతకంటే ముందుగా తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక చైతూకి జోడీగా నటించిన ఏమాయ చేసావే సినిమా సూపర్ హిట్ తో మళ్ళీ సమంత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకొని సౌత్ లో స్టార్ హీరోయిన్ బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకుంది.

ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్ళు దాటిపోతున్న సమంత ప్రస్తుతం ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్  సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. అక్కినేని ఇంటి కోడలుగా మారిన తర్వాత సమంత ఏకంగా నాలుగు సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది, అలాగే మజిలీ లాంటి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.  తాజాగా మిస్ గ్రానీ రీమేక్ ఓ బేబీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ ని ఏరి కోరి తెచ్చుకొని తెలుగులో రీమేక్ చేసింది. ఇక ఆమె అంచనాలు ఓ బేబీ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న సమంత దానికి ఓ బేబీ సినిమాని మంచి ఫ్లాట్ ఫాంగా చేసుకొని గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం రానా మాత్రం సమంత కాకుండా కంగనా, అలియా భట్ లని ఆప్షన్ గా అనుకుంటున్నారు. అయితే సమంత మాత్రం కచ్చితంగా ఓ బేబీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది. మరి అది ఎంత వరకు వర్క్ ఔట్ అవుతుంది అనేది వేచి చూడాలి. 


మిస్-గ్రానీతో-ఆ-కోరిక-తీర్చుకోవాలి-అనుకుంటున్నా-సమ
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author