టాలీవుడ్ యువ సంగీత దర్శకుల్లో ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ సంపాదించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. తెలుగులో మణిశర్మ తరువాత ఆ రేంజిలో చిన్న, పెద్ద అని తేడాలేకుండా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న దేవి సోదరుడు సాగర్ మనకు ఒక సింగర్ గా సుపరిచితుడే. 

అంతేకాదు అన్నయ్య దేవి స్వరపరిచిన కొన్ని సినిమాల్లోని పాటలను సాగర్ పాడడం జరిగింది. ఇక సాగర్ కు గత నెల 19న మౌనిక అనే అమ్మాయితో తమ కుటుంబసభ్యులు మరియు శ్రేయోభిలాషుల సమక్షంలో ఎంతో వేడుకగా పెళ్లి జరిగినట్లు దేవిశ్రీ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించడం జరిగింది. ఇక ప్రస్తుతం హ్యాపీగా ఒక ఇంటివాడైన మా సోదరుడిని ఆశీర్వదించమని దేవి కోరుతూ ఆ పోస్ట్ చేసారు. 

ఇక తమ్ముడికి పెళ్లి జరగడంతో, మరి నీపెళ్లెప్పుడూ దేవి అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్త్తున్నారు. నిజానికి గతంలో దేవి, నటి ఛార్మితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం జరిగింది. అయితే ఆ తరువాత అవి నిజం కావని తేలిపోయింది. మరి అభిమానులు కోరుతున్నట్లుగా దేవిశ్రీ ఎప్పుడు పెళ్లిచేసుకుంటారో తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: