కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఎలాంటి ఫేమస్ స్టార్స్ అయినా ఇబ్బందులు పడాల్సిందే. ముఖ్యంగా మీడియా విషయంలో కోపం స్టార్లకు పెద్ద శత్రువు. ఇప్పటికే ఆ సంగతిని చాలా హీరో, హీరోయిన్స్ ప్రాక్టికల్ గా అనుభవించారు. సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ్ షార్ట్ టెంపర్ గురించి చాలా కాలం క్రితం టాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ సాగిందన్న సంగతి తెలిసిందే. అతడు నటించిన సినిమాలకు నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చిన వాళ్ళపై సిద్ధార్థ్ నోరు పారేసుకున్నాడని ప్రచారమైంది. అయితే ఆ తర్వాతా జర్నలిస్టుల విషయంలో సిద్ధార్థ్ ఏమాత్రం తగ్గలేదని ఇటీవల కొన్ని ఈవెంట్ల ద్వారా కూడా అర్థమవుతోంది. గతంలో కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జర్నలిస్టుపై సిద్ధార్థ్ మాట జారాడని వార్తలొచ్చాయి. సిద్ధార్థ్ కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారని మీడియాలో హైలైట్ గా ప్రచారం కావడంతో దానిపై ఫ్యాన్స్ లో చర్చ సాగింది. 

సిద్ధార్థ్ నటించిన గృహం రిలీజ్ సమయంలో పలు యూట్యూబ్ చానెళ్ల తీరుతెన్నులపైనా చాలా సీరియస్ అవ్వడం పెద్ద రచ్చయింది. తాజాగా ది లయన్ కింగ్ ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ కోపం కోలీవుడ్ మీడియాలో డిబేట్ కి తెర తీసింది. తమిళ సినిమాల ప్రమోషన్స్ కి అయితే హీరోలెవరూ హాజరు కారు కానీ.. డబ్బింగు సినిమాల కోసం అటెండవుతున్నారా? అని ఓ జర్నలిస్ట్ హీరో సిద్ధార్థ్ ని ప్రశ్నించారు. దానికి సిద్ధార్థ్ ఎప్పటిలాగానే కాస్తంత కోపంగా ఆన్సర్ ఇవ్వడంతో జర్నలిస్టుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

ఇంతకీ సిద్ధార్థ్ ఏమని ఆన్సర్ చేశారు? అంటే.. మిగతావాళ్ళ మాటేమో కానీ.. నా సినిమా ప్రమోషన్లకు నేను బాధ్యతగా హాజరవుతున్నా. అయినా ఈ ప్రశ్నను ఎవరైతే హాజరుకావడం లేదో వాళ్లనే అడగాల్సింది. నన్ను కాదు అంటూ సిద్ధార్థ్ రుసరుసలాడారట. ది లయన్ కింగ్ తమిళ వెర్షన్ కి అరవింద స్వామి సహా హీరో సిద్ధార్థ్ ఓ కీలక పాత్రకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులోనూ ఈ సినిమాకి నాని- జగపతిబాబు లాంటి స్టార్లు వాయిస్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే ఈ రచ్చ జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: