క్వీన్ కంగ‌న యాక్ష‌న్ మోడ్ గురించి తెలిసిందే. ఆఫ్ ద స్క్రీన్‌, ఆన్ ద స్క్రీన్ ఫైటింగ్‌తో నిరంత‌రం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు నాయికా ప్ర‌ధాన చిత్రాల్ని ఎంపిక చేసుకుని భారీ యాక్ష‌న్కి రెడీ అవుతోంది. మ‌రోవైపు ఆఫ్  స్క్రీన్ మేల్ డామినేటెడ్  ప్ర‌పంచం పోరాటం సాగిస్తోంది. ఈ రెండింటా కంగ‌న డిమినేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌లే మ‌ణిక‌ర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝూన్సీ చిత్రంలో కంగ‌న న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ పాత్ర‌లో కంగ‌న త‌ప్ప వేరొక‌రిని ఊహించలేం అన్నంత‌గా ఒదిగిపోయి న‌టించింది. క‌త్తి యుద్ధాలు, గుర్ర‌పు స్వారీలో కంగ‌న అచ్చం రాకుమారినే త‌ల‌పించింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 


అటుపైనా క్వీన్ ఎంపిక చేసుకుంటున్న క‌థాంశాలు ఆస‌క్తిని పెంచుతున్నాయి. ప్ర‌స్తుతం యాంజెలినా జోలీ లారా క్రాఫ్ట్ రేంజు భారీ యాక్ష‌న్ స్క్రిప్ట్‌ని ఎంపిక చేసుకుని అందులో న‌టించేందుకు త‌యార‌వుతోంది. ధాక‌డ్ అనేది ఈ చిత్ర టైటిల్‌. ఈ చిత్రానికి ర‌జ్ నీష్ ఘాయ్ ద‌ర్శ‌క‌త్దం వ‌హిస్తున్నారు. కంగ‌న‌తో ఇండియా బెస్ట్ ఫీమేల్ యాక్ష‌న్ మూవీని తీస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం 10 నెల‌ల పాటు కంగ‌న‌తో బ్రెయిన్ స్టార్మింగ్‌సెష‌న్స్ చేశామ‌ని.. భారీ యాక్ష‌న్‌కి ఆస్కారం ఉన్న ఈ స్క్రిప్టును త‌ను అంగీక‌రించ‌డంతో సెట్స్‌కెళుతున్నామ‌ని తెలిపారు. ర‌చ‌యిత‌లు చింత‌న్‌గాంధీ-రినిష్ ర‌వీంద్ర‌ల‌తో పాటు కంగ‌న స్క్రిప్టు డిస్క‌ష‌న్స్‌లో పాల్గొన్నార‌ని వెల్ల‌డించారు. 


ఫిజిక‌ల్‌గా హార్డ్ వ‌ర్క్‌కి సంబంధించిన భారీ యాక్ష‌న్ సినిమా ఇది. దీని కోసం హాంగ్‌కాంగ్‌- థాయ్ ల్యాండ్ నుంచి యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ల‌ను బ‌రిలో దించుతున్నాం. గ‌న్ ఫూ ( ఏ మిక్స్ ఆఫ్ గ‌న్స్ మార్ష‌ల్ ఆర్ట్స్‌) అనే విద్య‌ను కంగ‌న నేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు. థాయ్ ల్యాండ్, యూర‌ప్‌, బుడాపెస్ట్‌, ప్రేగ్‌, దుబాయ్‌, అబుద‌బీ లాంటి చోట చిత్రీక‌ర‌ణ చేయ‌నున్నారు. అలాగే ఉత్త‌ర అమెరికాలోనూ కీల‌క షెడ్యూల్స్‌ని షూటింగ్ చేస్తాం అని వివ‌రాల్ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే కంగ‌న ప్రీ లుక్ పోస్ట‌ర్లు అంత‌ర్జాలంలో వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: