ఎనర్జిటిక్ స్టార్ గా తన అభిమానులతో పిలిపించుకునే రామ్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా అతడి కెరియర్ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూనే ఉంది. ఈమధ్య కాలంలో వరస పరాజయాలతో సతమతమైపోతున్న ఈ యంగ్ హీరో వచ్చే వారం విడుదల కాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. 

ఇప్పటికే ఈమూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్ లో బూతులు ఎక్కువగా ఉన్నాయి అన్న విమర్శల పై స్పందిస్తూ రామ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈమూవీలోని తన పాత్ర హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపధ్యంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే చాలామంది రఫ్ వ్యక్తులు బూతులు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తన పాత్రను పూరి అలా డిజైన్ చేసాడు అన్న క్లారిటీ ఇచ్చాడు. 

ఇదే సందర్భంలో వరస పరాజయాలతో ఉన్న పూరీ జగన్నాథ్ తో సినిమాను ఎందుకు చేసారు అంటూ ఒక మీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రామ్ మైండ్ బ్లోయింగ్ సమాధానం ఇచ్చాడు. ఎవరైనా ఒక మనిషి కష్టాలలో ఉండి బయటపడే మార్గం లేనప్పుడు లాటరీ తగిలితే బాగుండును అంటూ ఫీల్ అవుతూ లాటరీ టిక్కెట్లు కొంటూ ఉంటారని అదేవిధంగా తాను పూరీ జగన్నాథ్ సినిమాను లాటరీగా భావించి చేసాను అంటూ జోక్ చేసాడు. 

అంతేకాదు పూరీ తలచుకుంటే ‘పోకిరి’ లాంటి బ్లాక్ బస్టర్ తీయగలడు శ్రద్ధ పెట్టకపోతే ఒక భయంకరమైన ఫ్లాప్ కూడ తీయగలదు అని కామెంట్ చేస్తూ ప్రస్తుతం తామిద్దరం ఫ్లాప్ లలో ఉన్నాము కాబట్టి పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’ ను చాల మనసు పెట్టి తీసిన విషయాన్ని వివరించాడు. దీనితో ఆమీడియా మీట్ కు వచ్చిన మీడియా ప్రతినిధులు రామ్ అత్యంత సాహసంతో పూరీ పై వేసిన జోక్ కు షాక్ అయినట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: