అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో కొత్త సినిమా  షూటింగ్ జరుగుతున్నది.  ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది.  సెకండ్ షెడ్యూల్ ను రీసెంట్ గా స్టార్ట్ చేశారు.  సినిమా రిలీజ్ కు సంబంధించిన విషయాలను కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది యూనిట్.  


వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా నిన్న ప్రకటించారు.  అయితే, ఈ సినిమా టైటిల్ ఏంటి అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.  ఏ ఏ 19 పేరుతోనే సినిమాను షూట్ చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించి కొన్ని పేర్లు ట్రెండ్ అవుతున్నాయి.  


అందులో ఒకటి అలకనంద, రెండోది నాన్న ... నేను.  త్రివిక్రమ్ సినిమాకు పేర్లు పెట్టడంలో దిట్ట.  గతంలో ఎన్టీఆర్ సినిమాకు అరవింద సమేత వీర రాఘవ టైటిల్ పెట్టి వావ్ అనిపించాడు.  ఈ సినిమా టైటిల్ సూపర్ అని అందరు మెచ్చుకున్నారు.  సినిమా కూడా ఆ రేంజ్ లోనే హిట్టైంది. 


ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ రెండు సినిమాలు చేసిన సంగతితెలిసిందే.  రెండు మంచి విజయాలు సాధించాయి.  అందులో ఒకటి జులాయి, రెండోది సన్నాఫ్ సత్య మూర్తి.  ఇప్పుడు చేస్తున్న మూడో సినిమా కూడా ఇంచుమించుగా అదే రేంజ్ లో ఉంటుంది.  ఫాదర్ సెంటిమెంట్ తో సినిమా ఉంటుందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: