అవును మీరు వింటున్నది నిజమే .. వెనిజులా దీనిలో  సెక్స్ ఫెస్టివల్ జరగబోతుంది. ఎవరైనా ఫీ చెల్లించి పాల్గొనవచ్చు. వందమంది అమ్మాయిలతో అపరిమితమైన సెక్స్ అంటూ ఊరించే ప్రకటనతో పాటు.. మీరు కలలో కూడా ఊహించని రీతిలో ఏర్పాట్లు అంటూ సోషల్ మీడియాలో ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ చేస్తున్న హడావుడి ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాలోని నేవడ రాష్ట్రంలో సెక్స్ ఐలాండ్ పేరుతో ఆగస్టు ఈ నుంచి ఈ వేడుకల్ని నిర్వహిస్తామని చెబుతుందో సంస్థ.


ఇందుకోసం ఆసక్తి ఉన్న వారు చేయాల్సింది జస్ట్ ఆరు వేల డాలర్లు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కోవటమేనని చెబుతున్నారు.నాలుగు రోజుల పాటు అన్ లిమిటెడ్ సెక్స్ కోరుకునే పురుషుల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో సుఖాన్ని అందించేందుకు సిద్దమైన అమ్మాయిలకు ఇప్పటికే వైద్యపరమైన పరీక్షలు చేయించామని.. వారెవరికి సుఖ రోగాలు లేవని.. దానికి సంబంధించిన పత్రాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే 13 మంది బ్రిటీషర్లతో సహా 30 మంది టికెట్లను బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.


వాస్తవానికి గత ఏడాది ఈ వేడుకల్ని తొలుత కొలంబియాలోని కార్టెజెనా అనే ప్రైవేటుదీవిలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఈ ఈవెంట్ లో సాగే రచ్చ గురించి తెలిసిన దక్షిణ అమెరికా ప్రభుత్వం అడ్డుకోవటంతో వెనుజులాకు వెన్యూ మార్చారు. ఇంతకీ ఈ ఈవెంట్ ను నిర్వహించే సంస్థ పేరేమిటంటే ది గుడ్ గర్ల్ కంపెనీ. పేరులోనే భిన్నంగా ఉంటూ తామే చేస్తామన్న హింట్ ఇచ్చేస్తున్న ఈ సంస్థ నిర్వహిస్తోన్న ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: