వెండి తెరపై ఛాన్స్ లు రావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.  అందుకోసం ఎన్నో కష్టాలు పడాలి..ఆడిషన్లు, తిరస్కరణలు మళ్లీ ప్రయత్నాలు ఇలా ఎన్నో చేస్తే కాని వెండి తెరపై కనిపించే ఛాన్సు రాదు. అలాంటిది వెండి తెరపై ఛాన్స్ వచ్చి మంచి హిట్ ఉన్న సినిమాలో నటించిన ఓ వర్థమాన నటుడు అనుకోకుండా అకాలం మృత్యువడిలోకి వెళ్లారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటుడు అమిత్ పురోహిత్ మృతి చెందారు.  ఆయన మరణ వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.


ఆయన మృతి పట్ల 'సమ్మోహనం' యూనిట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. బుధవారం సాయంత్రం అమిత్ మరణించినట్లుగా ట్వీట్ చేసిన సుధీర్ బాబు ఓ మంచి యువనటుడ్ని  కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  ‘అమిత్‌ పురోహిత్‌ మరణం నన్నెంతో బాధించింది. ‘సమ్మోహనం’ సినిమాలో సమీరా మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ చాలా స్నేహంగా ఉండేవారు.

ప్రతి షాట్‌కు 100 శాతం న్యాయం చేసేవాడు. నైపుణ్యం పుష్కలంగా కలిగిన మంచి యువ నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు. అతడి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నా’ అంటూ పోస్ట్‌ లో పేర్కొన్నారు.కాగా,   అమిత్‌ హిందీలో ‘పంక్‌’ (2010), ‘ఆలాప్‌’ (2012) వంటి సినిమాల్లో నటించారు. అయితే అమిత్ మృతి వెనక కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: