దాదాపు 200 కోట్ల బడ్జెట్తో రామ్ చరణ్ సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించబడుతున్న ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 110 నుండి 130 కోట్ల మధ్యలో బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో సాహో సినిమా తరువాత ఆ రేంజ్లో బిజినెస్ చేసిన సినిమా సైరా నరసింహారెడ్డి మాత్రమే. 
 
కేవలం ఆంధ్రా ఏరియాకే ఈ సినిమాకు 55 నుండి 65 కోట్ల మధ్యలో అమ్మకాలు జరపుతున్నారట. సీడెడ్ ఏరియాకు 23 నుండి 26 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాకు ఈ సినిమాను 40 నుండి 45 కోట్ల మధ్యలో అమ్మబోతున్నారట. ఇలా భారీ రేట్లతో బిజినెస్ విషయంలో సైరా నరసింహారెడ్డి సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. 
 
ఈ సినిమాకు ఇంకా కర్ణాటక, ఓవర్సీస్, ఇతర ఏరియాల్లో బిజినెస్ జరగాల్సి ఉంది. శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులతో సైరా భారీగా లాభాల్ని అందించే అవకాశం ఉంది. గతంలో ఖైదీ నంబర్ 150 సినిమాతో రామ్ చరణ్ భారీ లాభాలు అందుకున్నాడు. సైరా సినిమాతో ఖైదీ నంబర్ 150 సినిమా కంటే ఎక్కువగా రామ్ చరణ్ లాభాలు పొందుతున్నట్లు తెలుస్తుంది. హీరోగా, నిర్మాతగా రెండు విధాలుగా రామ్ చరణ్ సక్సెస్ అవుతూ ఉండటం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: