ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ...మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. మిస్ మ్యాచ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజ గారికి డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నా" అన్నారు.
డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ మాట్లాడుతూ... విక్టరీ వెంకటేష్ గారు మా చిత్ర టీజర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నఅన్నారు. నా మొదటి సినిమా ఆటకథరా శివ సినిమాకు వెంకటేష్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా టీజర్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. భూపతిరాజ గారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ...వెంకీ గారు ఈ టీజర్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తాము"అన్నారు.