Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:57 am IST

Menu &Sections

Search

నా కెరీర్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ 'నిను వీడ‌ని నీడ‌ను నేనే' - ప్రీ రిలీజ్ లో సందీప్ కిష‌న్‌

నా కెరీర్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ 'నిను వీడ‌ని నీడ‌ను నేనే'  - ప్రీ రిలీజ్ లో సందీప్ కిష‌న్‌
నా కెరీర్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ 'నిను వీడ‌ని నీడ‌ను నేనే' - ప్రీ రిలీజ్ లో సందీప్ కిష‌న్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సందీప్ కిషన్ మాట్లాడుతూ "నేను ఎప్పుడూ నా సినిమా ఫంక్ష‌న్స్‌లో మంచి సినిమా తీశాన‌ని చెబుతా. ఫ‌స్ట్‌టైమ్ చెబుతున్నా... అదిరిపోయే సినిమా తీశా. ప‌క్కా హిట్ అయ్యే సినిమా తీశా. అది నేనొక్కడినే తీశానని చెప్పడం లేదు. టీమ్ కృషి వల్ల కుదిరింది. సినిమా కోసం అందరం కష్టపడతాం. కానీ, కుదరాలి. ఈ సినిమాకి కుదిరింది. నా కెరీర్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ సినిమా 'నిను వీడ‌ని నీడ‌ను నేనే'. ఎందుకు అంటే... సెట్‌లో, టీమ్‌లో ఎవరికీ ఏ లోటు చేయలేదు. ఇవాళ్టి వరకూ ఒక్క రూపాయి కూడా మోసం చేయలేదు. సినిమాను మాత్రమే తీశాం. సినిమాను మాత్రమే ప్రమోట్ చేశాం. ప్రేక్షకుల దగ్గర సినిమాయే మాట్లాడుతుంది. నిజాలు మాట్లాడుకోవాలంటే... ఈ రోజు ఉదయం వరకూ సినిమా విడుదల అవుతుందో? లేదో? మాకు తెలియదు. అంత టెన్షన్. నాకు తెలిసింది ఒకటే... కథను నమ్మాలి. ఆ కథను బాగా తీయాలి.

కరెక్టుగా ప్రమోట్ చేయాలి. జనాల్లోకి తీసుకువెళ్లాలి. మన పని మనం చేసుకుంటూ వెళతాం.  కానీ, ఒకడు ఒక సినిమా తీస్తున్నాడంటే... సంబంధమే లేకుండా ఆ సినిమాను ఆపడానికి బయలుదేరతారు. అందరి కన్నా.. అన్నిటి కన్నా సినిమా గొప్పది. ఆ సినిమాను ఆ సినిమా కాపాడుకుంటూ వస్తుంది. అదే 'నిను వీడని నీడను నేనే'. ఈ సినిమాకు విపరీతమైన అడ్డంకులు వచ్చాయి. నాకే షాక్. ఇదొక మిరాకిల్. నేను, మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్ కూర్చుని ఇటువంటి చిక్కులు వచ్చాయేంటని ఆలోచించుకుంటూ ఉంటే మరుసటి రోజుకు చిక్కులు తొలగిపోయేవి. ఎలాగో మాకూ తెలియదు. మంగళవారం అయితే హై టెన్షన్ మూమెంట్. ఏం జరుగుతుందో తెలియదు. శివ, సీతారామ్ ఏడుస్తున్నారు. వీళ్లిద్దరూ లేకపోతే నేను లేను. వీళ్లను నాకు దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ అనొచ్చు. ఫ్రెండ్స్ అనొచ్చు. వీళ్లే సినిమాను ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. అలాగే. మా ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్, రైటర్ సామ్రాట్ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. 'ఎస్ఎమ్ఎస్‌'కి 77మంది దగ్గర అప్పు చేస్తే గానీ సినిమా కుదరలేదని సుధీర్ బాబు చెప్పాడు. ఒక మనిషి 77 మంది దగ్గర అప్పు ఎలా చేస్తాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ నాకు అర్థమైంది. రామజోగయ్య శాస్త్రిగారు కథకు కీలకమైన పాట రాశారు. ఆయన తప్ప ఇంకెవరూ రాయలేరు. ఆ పాటను మేము విడుదల చేయలేదు. సినిమాలోనే చూడాలి. విడుదల రోజున ఆ పాటను అందరికీ వినిపిస్తాం. ఈ కథ ఈ టైమ్‌లో నా దగ్గ‌ర‌కు రావ‌డం అదృష్టం. ఈ నెల 12న సినిమాను చూడండి. తప్పకుండా హిట్ అవుతుంది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాను" అని అన్నారు.


కార్తికేయ మాట్లాడుతూ "నా సినిమా ఫంక్ష‌న్స్‌కి, ఇత‌రుల ఫంక్ష‌న్స్‌కి ఎప్ప‌డూ వెళ్ల‌లేదు. నన్ను ఎవరూ గెస్ట్‌గా పిల‌వ‌లేదు. ఫస్ట్ టైమ్ సందీప్ అన్న పిలిచారు. నాకంటే సీనియర్ అయినా... నేను జిమ్‌లోనూ కానీ, బయట ఎక్కడైనా కనిపించినా సందీప్ అన్న చక్కగా మాట్లాడతారు. ఆయనను చూస్తే నాకు తెలియకుండా 'బిగ్ బ్రదర్' అనే ఫీలింగ్ వస్తుంది. సినిమాలపై ఆయనకున్న ప్రేమ నన్ను ఇన్‌స్ఫైర్ చేస్తుంది. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తానే నిర్మాతగా మారారు. 'హిప్పీ' ప్లాప్ తరవాత నేను కోలుకోవడానికి టైమ్ పట్టింది. ఏడెనిమిదేళ్లల్లో సందీప్ అన్న ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. స్ట్రాంగ్‌గా నిల‌బ‌డ్డారు. ద‌ట్స్ రియ‌ల్లీ ఇన్‌స్ఫైరింగ్‌. జూలై 12న లాస్ట్ ఇయర్ మా 'ఆర్ ఎక్స్ 100' విడుదలైంది. ఈ ఇయర్ 'నిను వీడని నీడను నేనే' వస్తుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. ఇదీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అవుతుంది" అని అన్నారు.  
    
దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ "ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్. సందీప్ కిష‌న్‌కి స్క్రిప్ట్ వినిపిస్తే నటించడానికి మాత్రమే కాదు, నిర్మించడానికి కూడా ముందుకొచ్చారు. ఆయనతో పాటు మిగతా ఇద్దరు నిర్మాతలు దయా పన్నెం, వీజీ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ గారికి థాంక్స్. సినిమా విడుదల దగ్గరలో ఉంది కనుక ఎక్కువ మాట్లాడను. ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుందని చెప్పగలను" అని అన్నారు.
అన్యా సింగ్ మాట్లాడుతూ "నా ఫస్ట్ తెలుగు మూవీ 'నిను వీడని నీడను నేనే'. నా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది. సినిమాపై ఎంతో ప్రేమ కల ఈ టీమ్‌తో ప‌ని చేయ‌డం నా అదృష్టం. సినిమా చూసి నన్ను హీరోయిన్‌గా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా" అని అన్నారు. 


sandeep-kishan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే సినిమా ఆమె- త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్‌
ద‌ర్శ‌కేంద్రుడి చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట విడుద‌ల‌!
మ‌థ‌నం సినిమా చూశా , చాలా బాగుంది - ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి
కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!   -రైటర్ కమ్ హీరో ఆకాష్
 సూర్య `బందోబస్త్`తో మరో గొప్ప విజ‌యాన్ని సాధిస్తాడు - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌
ఎమోష‌న‌ల్ స్టూడెంట్ లీడ‌ర్ జ‌ర్నీ డియ‌ర్ కామ్రేడ్‌- విజయ్ దేవరకొండ
విభేదాలు ఏమీ లేవు...అస‌త్య ప్ర‌చారాలు ఆపండి..
హార‌ర్ గేమ్  ` వైకుంఠ‌పాళి` ఆడియో
 విక్టరీ క్లాప్‌తో ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ ’22’
గురువుకు తగిన శిష్యుడు!
`సాహో` వాయిదా ఎవ‌రికి లాభం..?
ఇక్క‌డ విజ‌యమే అల్టిమేటు...
బ్లాక్ బాస్టర్ దిశగా హైదరాబాద్ నవాబ్స్ 2
పాంట‌లూన్స్ సైమా అవార్డ్స్‌
ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిపించుకున్నా - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను
సిరివెన్నెల ఆడియో లాంచ్‌
ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిపించుకున్నా - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను
'శర్వానంద్, కాజల్, న‌టించిన 'రణరంగం' లోని 'కన్నుకొట్టి' పాట
ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిపించుకున్నా - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను
అనుష్క ''నిశ్శబ్దం'' ప్రచార చిత్రం
'శర్వానంద్, కాజల్, న‌టించిన 'రణరంగం' లోని 'కన్నుకొట్టి' పాట
దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గుర్తించి మంచి హిట్ ఇచ్చాడు! - 'నిను వీడని నీడను నేనే' థాంక్యూ మీట్‌లో ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌
అశ్వమేధం ట్రైలర్ లాంచ్
ఢిల్లీకి చేరిన బిగ్‌బాస్ వివాదం..!
స‌క్సెస్‌ఫుల్‌గా... స‌రిలేరునీకెవ్వ‌రు...
తోలుబొమ్మ‌లాటలాడుతున్న డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌
చిత్రీకరణ పూర్తిచేసుకున్న  'ధమ్కీ'
షూటింగ్ ని పూర్తిచేసుకున్న టెంప్ట్ ర‌వి " వైఫ్‌,ఐ"
ఆగ‌ష్టు 30న యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ " సాహో"
ఇది సముద్రాల వారి భిక్ష!  - ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్
ర‌ణ‌భీర్ క‌పూర్ ఓ మంచి ప్రేమికుడు..
'రారా.. జగతిని జయించుదాం.. రారా.. చరితని లిఖించుదాం..' 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌' ఫస్ట్‌ సాంగ్‌ విడుదల
న‌య‌న్‌కు పోటీగా సామ్‌
మిథాలిరాజ్‌గా తాప్సీ
వైలెంట్ ఎలా ఉంట‌దో చూపిస్తా
ఆగస్టు 2న గుణ 369
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.