Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 12:06 pm IST

Menu &Sections

Search

ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ నం.1 స్టార్ ఎవ‌రంటే..

ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ నం.1 స్టార్ ఎవ‌రంటే..
ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ నం.1 స్టార్ ఎవ‌రంటే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ స్టార్‌లు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీసెంట్‌గా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. always ramcharan పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తొలి రెండు గంటల్లో యాభై వేలు.. ప్రస్తుతానికి నాలుగు లక్షల మందికి పైగా రామ్ చరణ్ ఇ‌న్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవుతున్నారు. ఇ‌న్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కేవ‌లం ఒక్క ఫ్రొఫైల్ ఇమేజ్‌తోనే లక్షల మంది ఫాలోవర్స్‌ని సంపాదించాడు చెర్రీ.
 
ఇప్ప‌టికే టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఫ్యామిలీ ఫోటోల‌తో పాటు త‌మ సినిమా పోస్ట‌ర్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఈ లిస్టులో కుంద‌న‌పు బొమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. kajalaggarwalofficial పేరుతో ఉన్న కాజ‌ల్ అకౌంట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 1,538 పోస్టులు పెట్ట‌గా 1 కోటి 13 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక ర‌కుల్ ప్రిత్‌సింగ్ త‌ర్వాతి ప్లేస్‌లో ఉంది. rakulpreet పేరుతో ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 801 పోస్టులుపెట్ట‌గా, ఏకంగా 95 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆ త‌ర్వాతి ప్లేస్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నాదే. tamannaahspeaks పేరుతో ఉన్న ఇన్‌స్టాలో మిల్కీబ్యూటీ ఇప్ప‌టివ‌ర‌కు 1,118 పోస్టులు పెట్టింది. 87 ల‌క్ష‌ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. ఆ త‌ర్వాత స‌మంత‌. samantharuthprabhuoffl అనే అకౌంట్‌లో స‌మంత‌ ఇప్ప‌టికే 704 పోస్టులు పెట్ట‌గా 73 ల‌క్షల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. స‌మంత త‌ర్వాతి ప్లేస్‌లో పూజా హెగ్డే ఉంది. hegdepooja పేరుతో ఉన్న ఎకౌంట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 1,004 పోస్టులు పెట్ట‌గా, 64 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.  
ఆ త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. thedeverakonda పేరుతో ఉన్న ఎకౌంట్‌లో విజ‌య్ ఇప్ప‌టివ‌ర‌కు 117 posts పెట్టాడు. 37 ల‌క్ష‌ల మంది followers ఉన్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ alluarjunonline పేరుతో అకౌంట్ నిర్వ‌హిస్తుండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 263 పోస్టులు పెట్టాడు. బ‌న్నీకి 35 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ urstrulymahesh పేరుతో ఎకౌంట్ నిర్వ‌హిస్తుండ‌గా, ఇందులో ఇప్ప‌టివ‌ర‌కు 138 పోస్టులు పెట్టాడు. 32 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక ద‌గ్గుబాటి రానా ranadaggubati పేరుతో ఎకౌంట్ నిర్వ‌హిస్తుండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు 654 పోస్టులు పెట్టాడు. 31 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 
 tollywood-stars-instagramtollywood-stars-instagramtollywood-stars-instagramtollywood-stars-instagramtollywood-stars-instagramtollywood-stars-instagramtollywood-stars-instagram
ఇక యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ actorprabhas పేరుతో ఇన్‌స్ట్ర‌గ్రామ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 16 మాత్ర‌మే పోస్టులు పెట్టాడు. డార్లింగ్‌ను 23 ల‌క్ష‌ల మంది ఫాలో అవుతున్నారు. అఖిల్ ఇన్‌స్టా akkineniakhil పేరుతో ఉండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు 260 పోస్టులు చేశాడు. 1.3 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ jrntr పేరుతో ఎకౌంట్ నిర్వ‌హిస్తుండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 13 పోస్టులు మాత్ర‌మే చేశాడు. తార‌క్‌కు 9 ల‌క్ష‌ల 76 వేల‌మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 
మొత్తానికి ఇన్‌స్ట్ర‌గ్రామ్‌లో హీరోయిన్లే టాప్ ప్లేస్‌లో ఉన్నారు.   


tollywood-stars-instagram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.