ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో రోబో 2.0 లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించి అద్భుతమైన మార్కులు అందుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్న అక్షయ్ కుమార్..కొత్త కొత్త పాత్రలో నటిస్తూ సినిమాలు ఒప్పుకుంటూ ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇటువంటి క్రమంలో తాజాగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన  ఫోర్బ్స్ సెలబ్రిటీల జాబితా లిస్టు విడుదలైంది.


తాజాగా విడుదలైన ఈ జాబితాలో ఇండియా కంట్రీ నుండి కేవలం హీరో అక్షయ్ కుమార్ కి మాత్రమే చోటు దక్కినట్లు తెలుస్తోంది. టేలర్ స్విఫ్ట్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ లిస్ట్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి 35వ స్థానం దక్కించుకున్నారు. ప్రతీ సినిమాకు 35 నుండి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే అక్షయ్ బాలీవుడ్ లోనే టాప్ ఎర్నింగ్ స్టార్ గా ఈ మ్యాగజైన్ రాసుకొచ్చింది.


జూన్ 2018 నుండి ఈ ఏడాది జూన్ వరకు మొత్తం రూ.444 కోట్ల సంపాదనతో అక్షయ్ ఇంటర్నేషనల్ స్టార్లు రిహానా, జాకీచాన్, బ్రాడ్లీ కూపర్, స్కార్లెట్ జాన్సన్ లను అధిగమించారు. అంతేకాకుండా ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క యాడ్స్ రంగంలో కూడా భారీగానే సంపాదిస్తున్నట్లు దాదాపు 20 ఇంటర్నేషనల్ బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉన్నట్లు ఈ మ్యాగజిన్ రాసుకొచ్చింది.  

 



మరింత సమాచారం తెలుసుకోండి: