రామాయణం కావ్యాన్ని సినిమాగా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారు టాలీవుడ్ నిర్మాతలు.  కానీ, సరైన స్క్రిప్ట్ లేక ఇబ్బందులు పడ్డారు.  ఆ కావ్యాన్ని అచ్చంగా అలాగే తీయలేరు.  దాన్ని ఇప్పటి తరానికి అనువుగా సినిమాటిక్ గా మార్చాలి.  దీనిపై దాదాపు సంవత్సరం పాటు స్క్రిప్ట్ వర్క్ చేసిన ఒక దారికి తీసుకొచ్చారు. 

అంతా ఒకే అనుకున్నాక సినిమాను ప్రకటించాడు అల్లు అరవింద్.  దాదాపు 1500 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమా తెరకెక్కబోతున్నది.  3డిలో మూడు భాగాలుగా.  సీత పాత్ర కోసం నయనతారను తీసుకున్నారని వార్తలు వచ్చాయి.  దీన్ని పక్కన పెడితే.. ఇందులో అసలు రాముడు పాత్రను ఎవరు చేస్తున్నారు అన్నది తెలియాలి.  


రామాయణం అంటే రాముడు హీరో.  రామాయణంలో రావణుడికి ఓ ప్రముఖమైన పేరుంది.  రాముడి పాత్ర సౌమ్యంగా ఉంటె రావణుడి పాత్ర రౌద్రంతో కూడుకొని ఉంటుంది.  రౌద్ర పూరితమైన పాత్రను ఎవరు చేస్తున్నారు అన్నది తెలియాలి.  


అందుతున్న సమాచారం ప్రకారం, రౌద్రపూర్తిమైన రావణుడి పాత్రను ఎన్టీఆర్ తో చేయించాలని యూనిట్ అనుకుంటున్నారని సమాచారం.  అప్పట్లో ఎన్టీఆర్ రావణుడిగా చేస్తే చప్పట్లు కొట్టారు. 

రావణుడి పాత్ర లాంటి పాత్రను జైలవకుశలో ఎన్టీఆర్ చేశారు.  అదికూడా సూపర్బ్ గా ఉంటుంది.  హావభావాలు పలికించడంలో ఎన్టీఆర్ దిట్ట కాబట్టి, ఎన్టీఆర్ ఆ పాత్ర చేస్తే బాగుంటుందని అంటున్నారు.  మరి ఆ పాత్ర ఎవర్ని వరిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: