బిగ్ బాస్ ఈ షో పేరు వినగానే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? హోస్ట్ ఎవరు ? కాంటస్టెంట్స్ ఎవరు ? అని పలు రకాల ప్రశ్నలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఉంటాయి. ఆ ప్రశ్నలకు తగ్గట్టుగానే కొన్ని టీవీ ఛానళ్ళే, ఆన్లైన్ మీడియాలు గాసిప్స్ రాస్తుంటాయి. బిగ్ బాస్ 3 లో వీళ్లే కాంటస్టెంట్లు అని, సోషల్ మీడియాలో కాంట్రవర్సీ చేసే వాళ్ళను బిగ్ బాస్ కాంటస్టెంట్లు చేస్తారు నెటిజన్లు. గత ఏడాది ఈ విధంగానే శ్రీ రెడ్డి బిగ్ బాస్ 2 లో వస్తుంది అని అందరూ ఆశగా ఎదురు చూసారు.. కానీ ఆమె రాలేదు. అయితే ఈసారి బిగ్ బాస్ పై అలంటి వార్తలు వచిన్నప్పటికీ ప్రస్తుతం ఒక యాంకర్ 'బిగ్ బాస్ షో'పై విరుచుకు పడుతుంది.    


యాంకర్‌ శ్వేతారెడ్డి బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ జరుగుతోందని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. శ్వేతారెడ్డి మాట్లాడుతూ ''బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్‌ను 'ఇంప్రెస్‌' చేయాలట..! ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగువాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా? తెలుగువాళ్లపై గలీజ్‌ కల్చర్‌ రుద్దుతామంటే ఊరుకోం. బిగ్‌బాస్‌-3ని నిషేధించాలి. తెలుగు టీవీ నుంచి వెలివేయాలి... బిగ్‌బాస్‌ వల్ల ఎవరూ బాగుపడలేదు. బిగ్‌బాస్‌ ముసుగులో నిర్వాహకులు బ్రోతల్‌ హౌస్‌ నడుపుతున్నారా అంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై ఆమె మండిపడ్డారు. 


బిగ్ బాస్ 3 లో ఆమెను కంటస్టెంట్ తీసుకోడానికి ఏప్రిల్ లో తనకు ఒకరు ఫోన్ చేసారని, అప్పుడు ఆమె వారిని తనను ఎందుకు ఎంపిక చేసారని అడగ్గా ఫేమస్ యాంకర్ కాబట్టి ఎంపిక చేశామని చెప్పారని ఆమె చెప్పారు. షోలో పాల్గొనడానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకునే సమయంలో కొన్ని కాగితాలపై తాను సంతకాలు చేశానని.. వాటికీ సంబందించిన జిరాక్స్ ఆమెకు ఇవ్వలేదని అన్నారు. 'మిమ్మల్ని మేము ఎందుకు తీసుకోవాలి? మా బాస్‌ని ఎలా ఇంప్రెస్‌ చేస్తారు?' అని బిగ్‌బాస్‌ ప్రొడ్యూసర్‌ శ్యామ్‌ అడిగారని శ్వేతారెడ్డి ఆరోపించారు.


ఎన్నో సమావేశాలు పెట్టిన తర్వాత అగ్రిమెంట్ చేసారని, చివరికి కమిట్మెంట్ అడిగారని ఆమె వెల్లడించారు. అయితే ఈ విషయం మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడం అని కిందికి వస్తుందని, ఇలా ఇబ్బంది పడిన బాధితుల వివరాలు ఇప్పటికే సేకరించానని.. మిగితావారు త్వరలో బయాటకు వస్తారని ఆమె తెలిపారు. బిగ్ బాస్ షో కు సంబంధించి ఆమెను సంప్రదించిన రఘు, రవికాంత్‌, శ్యామ్‌ ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదని చెప్పారు. బిగ్ బాస్ 3 నిలిపివేయాలని, తెలుగు టీవీలో బిగ్ బాస్ షో ని బ్యాన్ చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఈ షో ఇప్పటికే జూన్ 21 వ తేదీ ప్రారంభం అవుతుందని నిన్ననే టీజర్ రిలీజ్ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: