తెలుగు ఇండస్ట్రీలో జర్నీ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న నటి అంజలి తర్వాత వెంకటేష్, మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో అచ్చమైన తెలుగు అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. తర్వాత తెలుగు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ మంచి ఛాన్సులు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తుంది అంజలి. 

ఇటీవల అంజలి నటించి హర్రర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది.  ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో గట్టిపోటీ ఉన్నప్పటికీ ఆమె అవకాశాలను దక్కించుకుంటూ వెళుతోంది. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను కూడా ఆమె బాగానే ఒప్పేసుకుంటోంది. తాజాగా ఆమె మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాను అంగీకరించింది. 


ఈ మూవీ గురించి కృష్ణన్ జయరాజ్ మాట్లాడుతూ .. "సాధారణంగా లేడీ ఓరియెంటెడ్ మూవీ అనగానే హారర్ నేపథ్యంతో కూడినదేమోనని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా కామెడీ ఫాంటసీ.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ముఖ్యంగా ఈ కథ అంజలికి చాలా బాగా నచ్చింది..వెంటనే ఓకే చెప్పేసింది. యోగిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నాము అని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: