మరో వారం రోజుల్లో స్టార్ మా ఛానెళ్ళో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతుంది. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఈ షోకు హోస్ట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ షోలో శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, పలు సీరియల్స్ లో నటిస్తున్న జాకీ, వరుణ్ సందేశ్ ఖచ్చితంగా పాల్గొనబోతున్నట్లు సమాచారం లభించింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం టీవీ9 ఛానెల్ కు చెందిన జాఫర్ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనబోతున్నాడట. 
 
టీవీ9 లో సినీ, రాజకీయ రంగానికి చెందిన వారితో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు జాఫర్. ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనేవారికి కోపం, చిరాకు తెప్పించేలా ప్రశ్నలు వేసేవాడు జాఫర్. ఇతని ఇంటర్వ్యూలపై కొన్నిసార్లు విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి జాఫర్ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొంటే మాత్రం బిగ్ బాస్ షోలో వివాదాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం  ఖచ్చితంగా ఉంది. 
 
బిగ్ బాస్ సీజన్ 2 అనుకున్నంతగా హిట్ కాకపోవడంతో బిగ్ బాస్ నిర్వహకులు కూడా సీజన్ 3 బ్లాక్ బస్టర్ చేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. హీరో వరుణ్ సందేశ్ తో పాటు అతని భార్య కూడా ఈ షోలో పాల్గొనబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హిట్ చేసిన నాగార్జున బిగ్ బాస్ షోను కూడా తన యాంకరింగ్ తో బ్లాక్ బస్టర్ చేస్తాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: