ఆది సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు వి వి వినాయక్. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మాస్ ప్రేక్షకుల్లో వినాయక్ సినిమాలంటే క్రేజ్ ఏర్పడేలా చేసుకున్నాడు. ఆది తరువాత దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్నాడు వినాయక్. యోగి సినిమా ఫ్లాపైనా కృష్ణ, అదుర్స్ సినిమాలతో హిట్లు అందుకొన్నాడు. వినాయక్ సినిమాలంటే మినిమం గ్యారంటీ అనే విధంగా పేరు తెచ్చుకున్నాడు. 
 
మాస్ ఇమేజ్ వదిలిపెట్టి అల్లు అర్జున్తో వినాయక్ తీసిన బద్రినాథ్ సినిమా డిజాస్టర్ అయింది. నాయక్ తో హిట్టు కొట్టినా అల్లుడు శీను, అఖిల్ సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. అఖిల్ సినిమా వినాయక్ దర్శకత్వంపై కూడా విమర్శలు వచ్చేలా చేసింది. వరుసగా రెండు ఫ్లాపుల తర్వాత చిరంజీవితో కత్తి రీమేక్ ఖైదీ నంబర్ 150 సినిమా హిట్టైనా దర్శకుడిగా వినాయక్ కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు ఈ సినిమా. 
 
ఖైదీ నంబర్ 150 తరువాత సాయి ధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ అనే సినిమా తీసాడు వినాయక్. ఈ సినిమా డిజాస్టర్ కావటంతో ఏ హీరో కూడా వినాయక్ కు అవకాశం ఇవ్వట్లేదు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడికి ఒక్క ఫ్లాప్ సినిమా తరువాత అవకాశం ఇచ్చే నిర్మాతలు, హీరోలే కరువయ్యారు. మధ్యలో బాలకృష్ణతో సినిమా ఓకె అయినట్లు వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాదని తెలుస్తుంది. మరలా వినాయక్ అవకాశాలు సంపాదించి హిట్టు కొడతాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: