బాలీవుడ్ లో గత ఏడాది నుంచి వరుసగా స్టార్ హీరోయిన్ల పెళ్లిళ్లు జరుగుతున్నాయి.  బాలీవుడ్ ఎవర్ గ్రీన్ ప్రేమ జంటలు  ప్రియాంక చోప్రా- నిక్ జోనస్, దీపికా పదుకొణే - రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ- విరాట్ ఇలా వరుసగా పెళ్లిళ్లు చేసుకొని ఒకంటివారయ్యారు.  తాజాగా ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ‘సాహూ’ లో ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ద కపూర్ కూడా పెళ్లిపీఠలు  బీటౌన్ లో వార్తలు వస్తున్నాయి. సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట  తో గత కొంత కాలంగా శ్రద్ద కపూర్ డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.  వచ్చే ఏడాది వీరిద్దరూ ఒక ఇంటివారు కాబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి.   

తాజాగా ఇదే విషయంపై పలుమార్లు ఆమె కుటుంబ సభ్యులకు ప్రశ్నలు ఎదురైన విషయం తెలిసిందే. తాజాగా నటి శ్రద్ధా కపూర్ తండ్రి బాలీవుడ్ సీనియర్ నటులు  శక్తి కపూర్ ను ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ప్రశ్నించగా... 'నా కూతురు పెళ్లి చేసుకోబోతోందా? పెళ్లికి నన్ను కూడా ఆహ్వానించడం మర్చిపోవద్దు' అంటూ చలోక్తులు విసిరారు. . తాను శ్రద్ధాకు తండ్రి అయినప్పటికీ... తనకు ఇంత వరకు ఈ పెళ్లి విషయం తెలియదని అన్నారు. పెళ్లి ఎక్కడ జరుగుతుందో చెబితే, తాను కూడా వస్తానని చెప్పారు. 

మీకేమైనా తెలిస్తే తనకు తప్పకుండా చెప్పాలని చమత్కరించారు. బాలీవుడ్ లో విలన్, కమెడియన్ గా శక్తి కపూర్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘సాహూ’ మూవీలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతే కాదు 'స్ట్రీట్ డ్యాన్సర్' సినిమాలో వరుణ్ ధావన్ జోడీగా నటిస్తోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కనున్న 'బాఘీ 3' మూవీకి కూడా సంతకం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: