Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 10:43 pm IST

Menu &Sections

Search

''బిగ్ బాస్' కాదు.. బ్రోతల్ హౌస్ నడుపుతున్నారు..?'' షోపై విరుచుకుపడ్డ యాంకర్ శ్వేతారెడ్డి

''బిగ్ బాస్' కాదు.. బ్రోతల్ హౌస్ నడుపుతున్నారు..?'' షోపై విరుచుకుపడ్డ యాంకర్ శ్వేతారెడ్డి
''బిగ్ బాస్' కాదు.. బ్రోతల్ హౌస్ నడుపుతున్నారు..?'' షోపై విరుచుకుపడ్డ యాంకర్ శ్వేతారెడ్డి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ టీవీ షోల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో ప్రసారం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే... గత రెండు సంవత్సరాలుగా ఘన విజయం సాధించిన టీవీ షో ప్రస్తుతం వివాదాలకు దారీ తీస్తుంది. మొత్తం 100 రోజుల పాటు 16 మంది సభ్యులు ఒకే ఇంటిలో ఉండి వారి జీవితంలో జరిగిన విషయాలను సాధారణ ప్రజలుగా ఒకరికొకరు తెలుసుకుంటారు. బిగ్ బాస్ షోలో నటించిన వారు టాస్క్ ల ఆధారంగా ఎలిమినేట్ అవుతూ... చివరకు ఒక్కరే విజేతగా నిలుస్తారు. ప్రస్తుతం ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్న బిగ్ బాస్ సిరిస్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు వివాదాలకు దారి తీస్తుంది.

తాజా బిగ్ బాస్ పై యాంకర్ శ్వేతారెడ్డి సంచనల కామెంట్స్ చేసింది. ''బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్ ని ఇంప్రెస్ చేయడం వలన ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగు వాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా..? బిగ్ బాస్ ని నిషేధించి తెలుగు టీవీ ప్రసారల నుండి వెలివేయాలి ఆమె తెలిపింది. అంతేకాదు బిగ్ బాస్ ముసుగులో నిర్వాహకులు బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా..?'' అంటూ యాంకర్ శ్వేతారెడ్డి మండిపడింది.

ఈ మధ్యే చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ల దారుణాలను పలువురు నటీమణులు బయటపెట్టి చాలా మందిని అరెస్ట్ చేయించారు. ఈ విషయమే ధర్నాలు కూడా చేసారు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో కూడా కాస్టింగ్ కౌచ్ పాత్ర ఉందని ఆమె ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ ముసుగులో నిర్వాహకులు చేస్తోన్న బాగోతాన్ని బయటపెట్టడానికి తాను మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ లో బిగ్ బాస్ షోకి సంబంధించిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి షో కోసం మిమ్మల్ని ఎంపిక చేశామని చెప్పి తనతో అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేయించుకున్నారని తెలిపింది.

అయితే బిగ్ బాస్ షోకు సంబందించిన అగ్రిమెంట్ కి  జిరాక్స్ పేపర్లు తనకు ఇవ్వలేదని.. అదే సమయంలో ''మిమ్మల్ని షోలో ఎందుకు తీసుకోవాలి..? మా బాస్ ని ఎలా ఇంప్రెస్ చేస్తారని'' షో ప్రొడ్యూసర్ శ్యామ్ తనను అడిగినట్లు తెలిపింది. అతడిని గట్టిగా నిలదీయడంతో తనను అవాయిడ్ చేశారని, 'కమిట్మెంట్' అడుగుతూ మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా చాలా మందితో ఇలానే ప్రవర్తించారని.. కొంతమంది బాధితులు తనకు ఫోన్ చేస్తున్నారని శ్వేతారెడ్డి తెలిపింది. ప్రస్తుతం కొంతమంది బాధితుల వివరాలను సేకరించే పనిలో ఉన్నానని... అవి తెలియగానే బహిర్గతం చేయగానే మిగిలిన బాధితులు బయటకి వస్తారని ఆమె తెలిపారు.
big-boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పార్టీ ఫిరాయింపై స్పందించిన తోట వాణి
అధికారులకే కాదు... పార్టీ నేతలకు సీఎం జగన్ కూడా ఆదేశాలు
గందరగోళం మధ్య ఏపీ శాసనసభ
టిక్ టాక్ చేశారు... అవుట్ సోర్సింగ్ సెక్షన్ కు బదిలీ అయ్యారు
డ్రైవర్లకు ఇక ఏడాదికి రూ.10వేలు... ప్రభుత్వ సంచలన నిర్ణయం
నా కృషి వల్లే రాష్ర్టంలో పెట్టుబడులు పెరిగాయి... టీడీపీ అధినేత చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా 12 సర్కిల్ స్టేషన్లు పూర్తి... హోం మంత్రి సుచరిత
రష్మిక బ్రేకప్ గురించి వెల్లడించి విజయ్
గ్యాంగ్ లీడర్ కాదు.. గా ‘‘నాని’స్ గ్యాంగ్ లీడర్’’
ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆర్కే రోజా
నిలిచిన భారతీయ వాహన నౌక
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.