రాధికా ఆప్టే పేరు ప్రతి విషయంలో ఒక సంచలమని చెప్పాలి. బాలీవుడ్ లో బోల్డ్ గా స్టేట్మెంట్స్ ఇచ్చే హీరోయిన్స్ ల్లో ఈమె ఒకరు. ఇదివరకు ‘పర్చెడ్’ సినిమాలో టాప్‌లెస్ సన్నివేశాలతో ఇంటర్నెట్‌ను హీటెక్కించిన ఆప్టే తాజాగా ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ నటుడు దేవ్ పటేల్‌తో జతకట్టింది. అతడి అదరాలను జుర్రుకుంటూ అభిమానులకు షాకిచ్చింది. ఇదేదో ప్రేమ వ్యవహారం అనుకోవద్దు. ‘వెడ్డింగ్ గెస్ట్’ అనే సినిమాలో ఓ సన్నివేశం. 


ఈ బ్రిటీష్-అమెరికా చిత్రం ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. 2018, సెప్టెంబరు 8న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. అనంతరం ఈ ఏడాది మార్చి 1న అమెరికాలో విడుదల చేశారు. అయితే, ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.  అయితే, ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ మధ్య కొన్ని హాట్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రం ఇంకా ఇండియాలో విడుదల కాకపోవడంతో ఆ సన్నివేశాలేవీ బయటకు రాలేదు.


ట్రైలర్‌లో కూడా వాటిని చూపించలేదు. అయితే, ఇంటర్నెట్‌లో మాత్రం ఆ సన్నివేశాలు లీకయ్యాయి. రాధిక ఆప్టే.. దేవ్ పటేల్‌ను ముద్దు పెట్టుకుంటున్న సన్నివేశాల చిత్రాలు వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. రాధికా ఆప్టే తెలుగులో ‘రక్త చరిత్ర’తోపాటు బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో నటించింది. అంతేకాదు, దక్షిణాది హీరోలోపై కామెంట్ చేసి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: