తెలుగు తమిళ భాషల్లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో ఆర్ బి చౌదరి స్టార్ ప్రొడ్యూసర్ గా రాణించారు. ఆర్ బి చౌదరి నిర్మాణంలో చిత్రం వచ్చిందంటే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయనే నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. 

సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నిన్నేప్రేమిస్తా, నువ్వు వస్తావని, ప్రియమైన నీకు, శివరామరాజు సంక్రాంతి, అన్నవరం, అందాల రాముడు, గోరింటాకు, రచ్చ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన సంస్థ. 

సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత, సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి మనవరాలు, బి.సురేష్‌ చౌదరి, మిశ్రి దంపతుల కుమార్తె చి||ల||సౌ|| పూజ అలియాస్‌ సానియా వివాహం ఖార్తారం చౌదరి, డఖుదేవి దంపతుల కుమారుడు చి|| ప్రవీణ్‌తో జరిగింది.

జూలై 11 సాయంత్రం 7 గంటలకు చెన్నయ్‌లోని శ్రీరామచంద్ర కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: