ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకం  సమర్పణలో వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బ్యానర్ పై 
గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా "పండు గాడి ఫోటో స్టూడియో".ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  కాగా ఈ చిత్ర టీజర్ ను సుకుమార్ ఇటీవల హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో ఆలీ, నిర్మాత గుదిబండి వెంకట సాంబి రెడ్డి, దర్శకుడు దిలీప్ రాజా తదితరులు పాల్గొన్నారు.


                                ఈ సందర్భంగా సుకుమార్  మాట్లాడుతూ"నేను ఆలీ గారికి  పెద్ద ఫ్యాన్ ని. ఆయన చేసే కామెడి ని చాలామంది దర్శకులు ఇష్టపడతారు. ఆలీ గారు ఈ సినిమాతో  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.ఒక స్టార్ హీరోలా ఆలీ గారిని దర్శకుడు ఈ చిత్రం లో చూపించారు. రెండు సవంత్సరాలు కథ తయారు చేసుకుని ,అనంతరం దర్శకుడు    దిలీప్ రాజా ఈ చిత్రాన్ని తెరకేక్కిన్చారు.   అలాగే నిర్మాత సాంబిరెడ్డి గారికి 22 విద్యాలయాలు వున్నాయి. చక్కటి అభిరుచి తో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు చాలా బాగున్నాయి. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా అందరిని అలరించనుంది." అని అన్నారు.                 
     ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ" మా చిత్ర టీజర్ ని విడుదల చేసిన సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు జంధ్యాల గారిఫోటోకి నమస్కరించి  ఈ సినిమా ప్రారంభించాం. ఈ చిత్రంలో మా హీరో ఆలీ ఎవరికి ఫోటో తీస్తే వారికి పెళ్లి అయ్యి పోతుంది. ఈ చిత్రంలో పాత్రలు విలక్షణంగాను, నటీనటుల పేర్లు వైవిధ్యంగాను ఉంటాయి.ప్రేక్షకులను కడుపుబ్బా నవించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.ఆలాగే నూతన నటుడు సందీప్ రాజా, టీనా చౌదరి  ఈ చిత్రం లో విలక్షణ పాత్రలు పోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: