రామ్ కథనాయకుడిగా నిధి అగర్వాల్, నభా నటేశ్ కథానాయకులుగా పూర్తి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూర్తి తెలంగాణ యాసతో మాస్ కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌ కాస్త మాస్ కథానాయకుడిగా, మాస్ డైలాగ్లతో మనముందుకు వస్తున్నాడు. ఇప్పటి వరుకు క్లాస్ చిత్రాలు తీసి అభిమానులను పెంచుకున్న రామ్  మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఇస్మార్ట్ శంకర్ తో ప్రయోగమే చేసాడు.   


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చార్మి నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్ ఓపెనింగ్స్ ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలకు సిద్దమైపోయిన ఇస్మార్ట్ శంకర్ సోషల్ మీడియాలో మస్తు హల్ చల్ చేస్తున్నాడు. 

ఈరోజు విడుదలైన ఓపెనింగ్ ట్రైలర్ లో ఇద్దరి హీరోయిన్లపై చిత్రీకరించిన రొమాంటిక్ సీన్స్ కట్ చేస్తూ ఈ ట్రైలర్ ను రూపొందించారు. రామ్ మనస్తత్వాన్ని, తెలంగాణ యాసలో అయన మాటలను, ఈ ట్రైలర్ లో క్లుప్తంగా చూయించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంత మాస్ చిత్రం హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. చాలా రోజుల నుంచి హిట్ లేక బాధ పడుతున్న పూరి జగన్నాథ్ కి ఈ సినిమా హిట్ అందిస్తుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: