మన ఫిల్మ్ ఇండస్ట్రీలో మేమంతా ఒకటే. మా టాలీవుడ్ ఓ పెద్ద కుటుంబం. ఎవరికి ఏ సాయం కావాల్సి వచ్చినా ముందుంటాం. యంగ్ టాలెంట్ ను నిత్యం ప్రోత్సహిస్తుంటాం. ఇలా చెప్తూనే ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతుంటారు. ఇలానే రియల్ స్టార్ శ్రీహరి కుటుంబం బలైంది.  శ్రీహరి బతికున్నప్పుడు ఆ ఇంట్లో ఎంత సందడిగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లెదు. ఎప్పుడైతే ఆయన ఆకస్మికంగా మనల్ని విడిచి వెళ్లిపోయారో, అప్పుడే ఇండస్ట్రీ కూడా ఆ కుటుంబాన్ని దూరంపెట్టింది. ఒక సందర్భంలో (శామి) సాయం కోసం అన్నట్టు ఇండస్ట్రీ పెద్దలవైపు ధీనంగా చూసింది. ఓ పెద్ద నటుడి కొడుకు హీరోగా లాంచ్ అవుతుంటే టాలీవుడ్ లో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ మొత్తం ఒక్కటైపోతుంది. 

కానీ శ్రీహరి కొడుకు విషయంలో మాత్రం ఇండస్ట్రీ మౌనంగా ఉండిపోయింది. మనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తోంది. ఇండస్ట్రీలో ఓ పెద్ద హీరోను శ్రీహరి కుటుంబం స్వయంగా వెళ్లి కలిసి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు రావాల్సిందిగా శ్రీహరి భార్య డిస్కోశాంతి స్వయంగా ఆహ్వానించగా ఆ హీరో బిజీ అని చెప్పి తప్పించుకున్నారట. ఆ తర్వాత చిన్నాచితకా సినిమా ప్రమోషన్లకు మాత్రం హాజరయ్యాడు. ఓ 2 సినిమాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించాడు. శ్రీహరి కొడుకు ఈమాత్రం దానికి కూడా నోచుకోలేదు పాపం. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పిలిస్తే నిరాకరిస్తున్నారని శ్రీహరి ఫ్యామిలీ కొంతమంది హీరోలతో వీడియో బైట్లు వేయాలని ప్లాన్ చేసింది. 

మేఘాంశ్ కు మద్దతుగా ఒక్క 30 సెకెన్లు మాట్లాడితే చాలనుకుంది. కానీ ఈ పెద్దమనుషులు దీనికి కూడా ఒప్పుకోలేదు. 30 సెకెండ్లు సెల్ ఫోన్ లో మాట్లాడి వీడియో పంపించడానికి వీళ్లకు తీరిక లేదట. ఒకప్పుడు శ్రీహరి లేకుండా సినిమాలు చేయలేమని, ఊహించుకోలేమని ఆర్భాటంగా మాట్లాడిన మన స్టార్లు కూడా ఇప్పుడు ముఖం చాటేశారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే.. దర్శకులు కూడా శ్రీహరి గురించి, అతడి కొడుకు డెబ్యూ గురించి మాట్లాడ్డానికి నిరాకరించారు. అయితే పూరి జగన్నథ్, శ్రీనువైట్ల, పరశురాం, హరీష్ శంకర్, సాయిధరమ్ తేజ్, అలీ, సతీష్ వేగేశ్న, లారెన్స్, మంచు మనోజ్, గోపీచంద్ మలినేని, బాబి, ఎన్.శంకర్, వెన్నెల కిషోర్ లాంటివాళ్లు మాత్రమే శ్రీహరి తనయుడు డెబ్యూ గురించి మాట్లాడి తమ పెద్దమనసు చాటుకున్నారు. పైకి పెద్దమనుషులమని చెప్పుకునే స్టార్ హీరోలు, దర్శకులు ఎవరూ ఈ లిస్ట్ లో లేరు. ఇది టాలీవుడ్ లో ఐక్యత అంటే.



మరింత సమాచారం తెలుసుకోండి: