విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రమేకాదు, టాలీవుడ్ జనాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా వచ్చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విజయ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే, పర్లేదు..బాగుంది అని అనిపించేలా మాత్రం ట్రయిలర్ కట్ చేయడానికి చిత్ర బృందం చాలా ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది.

ట్రైలర్ లో ప్రతి సీన్ విజయ్ దేవరకొండ గత సినిమాలను పక్కాగా గుర్తు చేస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి, నోటా, గీత గోవిందం.. ఇలా ప్రతి సినిమాను గుర్తుచేసేలా వున్నాయి సీన్స్. విజయ్ ను ఎలా చూస్తే అభిమానులు ఇష్టపడతారో ఖచ్చితంగా అలానే ప్రెజెంట్ చేసినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

అగ్రెసివ్ నెస్, ఎమోషన్, రొమాన్స్ ఇలా అన్ని షేడ్స్‌ని కామ్రేడ్ ట్రైలర్ లో చూపించేశారు. అంతేకాదు, సినిమా లైన్ కూడా చాలావరకు రివీల్ చేసేసారు. మొత్తంమీద విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ట్రైలర్ నచ్చేలాగే వుంది కానీ, కొత్తదనం మాత్రం కనిపించలేదనే చెప్పాలి. మరి రీషూట్స్ కూడా చేసి కొన్ని సీన్స్ ని పక్కాగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఈ సినిమా రిలీజైతే గాని తెలీదు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ హీరోగా, మరో కొత్త సినిమాలోను నటిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: