యాంగ్రీ యంగ్ మెన్ గా రాజశేఖర్ కు పేరుంది.  సినిమా ఇండస్ట్రీలో అనేక హిట్ సినిమాలు చేశారు.  అప్పట్లో అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి.  గరుడవేగ, రీసెంట్ గా కల్కి సినిమాలు హిట్ కొట్టడంతో రాజశేఖర్ హ్యాపీగా ఉన్నాడు.  కేవలం హీరోగానే కాకుండా అవసరం అనుకుంటే విలన్ పాత్రలు చేయడానికి సైతం రెడీ గా ఉన్నట్టు చెప్పారు.  


మెగాస్టార్ చిరంజీవితో స్నేహం కోసం సినిమాలో విజయ్ కుమార్ పాత్ర కోసం రాజశేఖర్ మెగాస్టార్ ను సంప్రదించారట.  అయితే, రాజశేఖర్ యంగ్ గా ఉండటంతో ఆ పాత్ర విజయ్ కుమార్ ను వరించింది.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  ఆ తరువాత అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 


ఇందులో ఉపేంద్ర పాత్రకు ఒక ఛాయిస్‌గా రాజశేఖర్‌ను కూడా అనుకున్నారట. అయితే, అది తన వరకూ రాలేదని రాజశేఖర్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ పోషించిన ‘రేలంగి మామయ్య’ పాత్రను కూడా రాజశేఖర్‌ చేయాల్సింది. ఆ పాత్ర గురించి పూర్తిగా చెప్పకపోవడంతో తాను సరేనని అనలేకపోయానని అప్పట్లో చెప్పారు.


దీంతో పాటు తమిళంలో సూపర్ హిట్టైన తని ఒరువన్ సినిమాను తెలుగులో ధృవ పేరుతో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేశారు.  తమిళ్ లో అరవింద్ స్వామి చేసిన పాత్రను మొదట రాజశేఖర్ చేత చేయించాలని అనుకున్నారు.  కానీ, ఫైనల్ గా తమిళ్ లో నటించిన అరవింద్ స్వామినే తీసుకున్నారు.  ఈ నాలుగు సినిమాలు అలా మిస్ అయ్యాయని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: