టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో ఇప్పుడు ఓ యంగ్ హీరో కి సంబంధించిన న్యూస్ జోరుగా వైరల్ అవుతుంది. ఓ బడా సినిమా ఫ్యామిలీకి చెందిన ఆ వారసుడు చాలా కొత్త కొత్త ఐడియాలతో సినిమాలు తీస్తాడు అన్న పేరుంది. ఫలితాల సంగతి ఎలా ఉన్నా మంచి కథలు ఎంపిక చేసుకుని కష్టపడి విషయంలో ఈ యంగ్ హీరోకి మంచి మార్కులే ఉన్నాయి. తండ్రి, అన్న నుంచి వచ్చిన సినిమా వారసత్వాన్ని కంటిన్యూ చేసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. 


ఈ యంగ్ హీరోకు తన కుటుంబ స‌భ్యుల‌తో పరిచయం ఉన్న ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లయి మూడేళ్లు అవుతున్న వీరిద్దరి మధ్య ఏమాత్రం సఖ్యత లేదట. దీంతో తీవ్రమైన మ‌న‌స్ప‌ర్థ‌ల‌ నేపథ్యంలో ఆయన హీరో భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇటు సినిమా కెరీర్ ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డం.... అటు భార్య దూరం కావ‌డంతో ఆ యువ హీరో మరింతగా డిప్రెషన్‌కి గురయ్యాడని, కొత్త సినిమాలపై ఏ మాత్రం కాన్‌సంట్రేష‌న్ చేయ‌కుండా... మ‌ద్యం, డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డిపోయాడ‌ట‌. 


చివ‌ర‌కు ఆ హీరో తండ్రి సినిమాల్లో సీనియ‌ర్ హీరో కావ‌డంతో త‌న కుమారుడిని మార‌తాడ‌ని అమెరికాకు పంపిన‌ట్టు టాక్‌. అయితే అక్క‌డ కూడా ఆ హీరో గారు త‌న తీరు మార్చుకోకుండా మ‌రింతగా మ‌ద్యం, డ్ర‌గ్స్‌కు బానిస అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అత‌డి గురించే అత‌డి కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కు ఆ యంగ్ హీరో ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థ‌మై ఉంటుంద‌నుకుంట‌.



మరింత సమాచారం తెలుసుకోండి: