ఉదయ్ కిరణ్ పేరెత్తితే చాలు.. అయ్యో పాపం అనిపిస్తుంది అందరికీ. కెరీర్ ఆరంభంలో ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ లాంటి సూపర్ హిట్లతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఊపుమీద కనిపించాడు. తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ సంపాదించిన అతను.. తర్వాత ఇంకా పెద్ద స్థాయికి ఎదుగుతాడని అనుకున్నారు. 


కానీ వ్యక్తిగత జీవితంలో, సినీ కెరీర్లో అతడికన్నీ ప్రతికూలతలే ఎదురయ్యాయి. ఒక దశ దాటాక సినిమాలు లేక ఆత్మన్యూనతా భావానికి గురై  బాధాకర రీతిలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు ఉదయ్. ఒక సినిమాగా తీయగలిగే మలుపులు ఉదయ్ జీవితంలో ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఉదయ్ బయోపిక్ గురించి కూడా కొంత డిస్కషన్ నడుస్తోంది.


ఉదయ్‌కి హీరోగా లైఫ్ ఇచ్చిన తేజనే ఈ సినిమాను డైరెక్ట్ బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. తేజ నిజంగా ఉదయ్ జీవితంపై సినిమా తీయబోతున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం తేజ దగ్గర ప్రస్తావిస్తే మాత్రం అందుకు అవకాశమే లేదన్నాడు. ఉదయ్ కిరణ్ జీవితంలో ప్రతి విషయం తనకు తెలుసని తేజ చెప్పాడు. చనిపోవడానికి ముందు తన జీవితంలోని కష్టాలన్నింటినీ తనతో చెప్పుకుని ఉదయ్ బాధ పడ్డట్లు వెల్లడించాడు. ఐతే ఉదయ్ గురించి తనకు అంతా తెలిసినప్పటికీ అతడి జీవితం మీద సినిమా మాత్రం తీయబోనని తేజ స్పష్టం చేశాడు. 


అతడి కష్టాలు, కన్నీళ్లను క్యాష్ చేసుకోవాలని తాను భావించడం లేదు కాబట్టే సినిమా తీయనన్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’తో చాలా ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన తేజ.. ఇటీవలే ‘సీత’తో మళ్లీ ఫ్లాప్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాతి సినిమాపై ఇంకా ఏ క్లారిటీ రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: