అక్కినేని నాగార్జున రాహుల్ రవీంద్రన్ దర్శకత్యంలో నటిస్తున్న 'మన్మథుడు 2' కు సంబంధించి కొద్ది రోజులక్రితం విడుదల అయిన టీజర్లకు విశేష స్పందనతో పాటు అనేక విమర్శలు కూడ వచ్చాయి.  ఈమూవీలో లిప్ లాక్‌లు ఉండడంతో ఈ వయస్సులో నాగార్జునకు ఇవి అవసరమా అంటూ సెటైర్లు పడటమే కాకుండా దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ ఆయన భార్య చిన్మయిని కూడ చాలామంది టార్గెట్ చేసారు. 

ఒకవైపు చిన్మయి సినిమాల్లో బోల్డు సీన్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుంటే ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ఇలాంటి సీన్స్  ఎలా తీసాడు అంటూ చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు. దీనికితోడు ఈమూవీలో రకుల్ ప్రీత్  చాలా బోల్డుగా కనిపిస్తూ  ‘ఇప్ప‌టి వ‌ర‌కు U సర్టిఫికెట్ ట్రై చేశాను. ఇక‌పై A స‌ర్టిఫికెట్ చూపిస్తా' అంటూ ర‌కుల్ నాగ్‌ ‌తో చెప్పేన డైలాగు తో ఈసినిమాలో బూతు కంటెంట్ ఎక్కువ ఉంటుందా అన్న సందేహాలను కలిగిస్తోంది.

ఇప్పుడు ఈవిషయాలు అన్నీ నాగార్జున దృష్టి వరకు రావడంతో రాహుల్ రవీంద్రన్ తనతో రకుల్ ప్రీత్ తో చిత్రీకరించిన బోల్డ్ సీన్స్ అన్నీ కట్ చేయవలసిందిగా నాగార్జున స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. నాగ్ సినిమాలు అంటే యూత్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. అలాంటి నేపధ్యంలో ఇలాంటి బోల్డ్ కంటెంట్ సీన్స్ ‘మన్మధుడు 2’ లో ఉన్నాయి అని జరిగే ప్రచారం ఏమాత్రం మంచిది కాదు అని నాగార్జున అభిప్రాయపడుతున్నట్లు టాక్. 

పెళ్ళి అంటే ఇష్టపడని ఒక నడివయసు వ్యక్తిని ప్రేమలో దించే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ‘మన్మధుడు 2’ లో కనిపించబోతున్న పరిస్థుతులలో కేవలం ఆ కథకు సంబంధించిన యాంగిల్ లో హాస్యాన్ని మాత్రమే ఉంచమని బోల్డ్ సీన్స్ తీసేయమని నాగార్జున రాహుల్ రవీంద్రన్ కు చెప్పినట్లు సమాచారం. వచ్చేనల విడుదల కాబోతున్న ఈ మూవీ ఏకంగా ‘సాహో’ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్న పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నాగ్ చాల శ్రద్ధగా చూస్తున్నాడు అనుకోవాలి.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: